ధరణి
ఎన్ని యుగాలదిది
ఎన్ని యాగాల ఫలమిది
నక్షత్రాల పొదిగిన నింగి
కిరణ కర్ణున్ని కన్నది
శత సహస్ర కిరణాలతో
వస్తున్నాడదిగో
ఉదయ బాణుడు
ఏ తల్లి కన్న బిడ్డో
తూర్పు తల్లి పెంచి పెద్దచేసింది
ఎర్రని రక్తాన్ని దారబోయగ
పచ్చని ధరణి గర్భాన
వసంతాల పిల్లలు
ఆరు ఋతువులై
తల్లి ధరణి చను బాలు తాగి
ఏరులు
పూదారులు
వనాలు
నదీ నదాలు
గిరి శిఖరాలు
చందన వన కన్నెలు
జీవం పోసుకున్నవి
వెదురు పాడెను
గాలి తోడుగా
నెమలి అడెను
మేగ గర్జనల మృదంగ
ద్వనుల
ఓ పర్వతమ నే గాలినై వస్తాను
ఓ వనదేవత చిగురునై పుడతాను
మరు జన్మలో
ఎన్నటి దానవు నీవు
మొన్నటి మనిషిని నేను
నిన్ను చంపితే నేను లేను
నేను వుండాలంటే
నీవు బ్రతకాలి
నిను బ్రతికించుకునేదెట్ల
నేను బ్రతికేదెట్ల
నీ కడపును కోసి
రక్త మాంసాలు అమ్ముకుంటున్న
మనుషులనేమనాలి
ఎన్ని కాలుష్యాలు
బరిస్తున్నావో
సహన శీలి
నీ మూడవ కన్నెరుగని
మనిషి
ఏనాడో ఒకనాడు
తన అస్తిత్వం
కోలిపొక తప్పదు
అయినా
నా కడ వూపిరి వరకు
నిను బ్రతికించుకుంటాను
మరణించి నీ ఒడిలో
పవలిస్తాను
