సమభావనే నిజమైన ప్రేమ భావన

సమభావనే నిజమైన ప్రేమ భావన


సమభావన అంటే ఏమిటి?
మనిషి స్వభావం చాలా చిత్రమైనది.బండరాయిలో శిల్పాన్ని చూస్తాడు.చె ట్ల ఆకుల్లోఔషధగుణాలు చూస్తాడు.కాని,తోటిమని షిని మనిషిగాచూడడు.మానవత్వంమరచిపోయితనకన్నా తక్కువ స్థాయి వారిని ఎంతోహీనంగాచూస్తాడు.మనిషిసంఘజీవి,ఒంటరిగా జీవితం సా గించలేడు. ఎంత గొప్ప వారైనా తనకన్నా తక్కు వ స్థాయి వారిపై ఆధా రపడవలసిందే. ఉన్నత పదవుల్లో ఉన్నవారు చి న్న పనులు చేసుకుంటూ జీవించేవారిని చిన్న చూ పు చూడకూడదునిజా నికి ఈసమాజంలోప్రతివ్యక్తీప్రత్యేకమే.అందరిపట్లా సమభావం కనబర చాలి గాని హీనభావం ఉండకూడదు. మనిషి నిత్యం ఆరాధించే ధైవా నికి ఎలాంటి పక్షపాత వై ఖరీలేదు.రామాయణంలో శ్రీరాముడు ప్రతి ఒ క్కరినీ తన బిడ్డ లుగా భావించి పరిపాలనసాగిం చాడు. అరణ్యంలో చెట్ల ను, పక్షులను చివరికి రాక్షసులను కూడా తన ప్రేమతత్వంలో ముంచి ఉత్తముడిగా నిలిచాడు. ఆ భగవంతుడికిసర్వమా నవాళిపై అపారమైన ద య ఉంది.ఆయనకు ఏ జీవుడిపైనా రాగద్వేషాలు కాని, ఇష్టం గానీ, అయి ష్టం గానీ లేవు. కుండ పో తగా వాన కురుస్తూంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకుని గోవులతో సహా ఆబాల గోపాలాన్ని రక్షించాడు. పాండవ రాయబారిగా హస్తినాపురానికి వెళ్ళి నప్పుడు శ్రీకృ ష్ణుడు విదురుడికి అతిథిగా వెళ్ళాడు. కౌరవులకు విదురుడు తక్కువ కులం వాడు అనే భావం ఉంది. తన భక్తిలో కుల మతాలకు చోటు లేదనే సత్యాన్ని ప్రకటించేం దు కు విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరించాడుఆపరమాత్మ. సమదృష్టి కలిగిన వారు ప్రశాంత మనుస్కు లై ఉంటారు. అందరిపట్లా ప్రేమభావం కలిగి ఉంటా రు. భేదభావం కలవారు నిత్యంపగ,ప్రతీకారాలతోరగిలిపోతుంటారు.దుర్యో ధనుడు ఆ కోవకు చెంది నవాడే. అతడు రారాజు అయినా అం తిమక్షణం వరకు పాండవులపట్ల ద్వే షం పెంచుకుని అ శాం తితో బతికాడు. భేదభా వం కలవారికి ధర్మంపట్ల ఎలాం టి ఆసక్తి ఉండదు, వారికి శాంతి రుచిం చదు. మంచి మాటలు ఎన్ని చెప్పినా వారు వినరు. నిత్యం తమ ధోరణి లోనే జీవించి దుష్ఫలితాలు పొందుతారు. అంతిమం గా వినాశనం పొందడం తప్ప మరోమార్గం వారికి లేదు.నన్ను సర్వ భూతా ల్లోను, సర్వ భూతాల్ని నాలోనుచూసేవాడుఎప్పటికీనానుంచివేరు కాడు, నేను అతడినుంచి వేరు కాదుఅని గీతలో పరమాత్మ బోధిం చాడు.అందుకే అందరినీ సమ దృష్టితో చూడాలి.అందరూమనల్నిప్రేమిస్తూ,గౌర విస్తూ ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. అలాంటి సంతోషం, గౌ రవానికి మనం అర్హత పొందాలంటే మనం కూడా ఎదుటివారిని అభిమా నించాలి. గౌరవం ఇస్తేనే గౌరవం తిరిగి లభి స్తుంది. అవమానకరంగా మాట్లా డితే దుష్ఫలితాలు అనుభవించక తప్పదు.రామకృష్ణ పరమహంస పేద,ధనికతారతమ్యాలను పాటించ లేదు. స్త్రీల ను, పురుషులను సమా  నంగాభావించేవారు.ఆయన శిష్యుడైన వివేకా నందస్వామి దరిద్రంలో బాధపడే సాటిమనిషిని నారాయణుడిగా భావిం చాలని బోధించేవారు.ప్రభువైనా చండా లుడైనా ఒక్కటే అన్నాడు అన్నమ య్య. ఏ కొండకోనల్లోనో పుట్టి ప్రవహి స్తుంది జల ధార. మార్గమధ్యంలో అన్నింటినీ చేరి జీవకళ నింపుతుంది. అలాగే ఎవరో వేసిన విత్తనం నుంచి చెట్టు ఎదిగి అం దరికీ ఫలాలు అంది స్తుం ది. ఇలాంటి ప్రకృతి ధర్మా న్ని ప్రతి మనిషీ అలవర చుకోవాలి.సమభావన అంటే ప్రేమభావన. ఆ భావనతో మనం తోటి వారిని కరుణ, దయ, ఉపకారం వంటి దైవీ గు ణాలతోఆనందపరచాలి. అప్పుడే జన్మ సాఫల్య మవుతుంది.
వైద్య ఉమారాణి
అంగన్వాడీ టీచర్
లింగాపూర్
కామారెడ్డి
9000346200

Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments