యోగాభ్యాసం -- బెజుగాం శ్రీజ, ట్రిపుల్ ఐటీ బాసర, గుర్రాలగొంది, జిల్లా సిద్ధిపేట.

యోగాభ్యాసం -- బెజుగాం శ్రీజ, ట్రిపుల్ ఐటీ బాసర, గుర్రాలగొంది, జిల్లా సిద్ధిపేట.

యోగాభ్యాసం

సీసం.
ధనములేకున్నను ధ్యానముజేయగ
మనసుశుధ్ధిపడును మనకునెపుడు
వ్యాయామమునుజేయవ్యాధులేతొలగును
స్వేచ్ఛయె దొరకును ‌శీఘ్రముగను
ఆసనా లెన్నియో ననునిత్య మునుజేయ
ఆయుషు బెరుగును నవనియందు
చిననాటి నుండియే చేసిన సతతము
చురుకుగా మేధస్సు పెరుగునండి.


తేటగీతి.
దినము యోగనుజేయగ ధృడముకలిగి
ఆత్మపరిశుద్ధి జరిగియు హాయిపెంచు
మరుపుతగ్గించి రయముగా మంచికలిగి
రక్షణనుపెంచుతనువుకు లక్షణముగ

-- బెజుగాం శ్రీజ,
ట్రిపుల్ ఐటీ బాసర,
గుర్రాలగొంది జిల్లా సిద్ధిపేట.


0/Post a Comment/Comments