*అంతా మాయే కదా*
సకలము దైవమయము
కాగలదు సత్యమయము
ఘనంగా రాచబాట వేస్తారు
విజయకేతనం ఎగురవేస్తారు
ఆటవిక పాలన ముగిసేనా
నీడ నిచ్చు రోజులలో
అణగారిన బ్రతుకులకు
యాతన తప్పునో లేదో
నాదనుకున్న బంధం లో
కాన రాని ఆప్యాయతలు
అప వాదులు తో దూషణలు
అబద్దపు ప్రేమావేశాలు అవసరమా
కమనీయ పదబంధం తో
రాయ గలిగిన కావ్యాలు
తర తరాలు కు గుర్తుండి పోయేలా
ఇలలో తరచి నిలిచి పోయేను కదా
✒️📝✒️📝✒️📝✒️
*దొడ్డపనేని శ్రీవిద్య*
విజయవాడ
