కంబదహల్ పాఠశాలలో కవిరత్న గద్వాల సోమన్నకు సన్మానం
పెద్దకడబూరు మండల పరిధిలోని, హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న కవిరత్న గద్వాల సోమన్నకు కంబదహల్ ప్రాథమికోన్నత పాఠశాలలో, విద్యార్థుల మధ్యలో సన్మానం జరిగింది. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా బాలసాహిత్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని మండలానికి మంచి పేరు తెచ్చి, అందరికీ ఆదర్శంగా నిలిచినందుకు, వారి సాహితీ సేవలు గుర్తుస్తూ.. ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు యస్.జయవంతు, ఉపాధ్యాయులు పి.సూర్యప్రకాష్, వై. కుముద్వవతి, బి.పాండురంగ,యు.యం.లక్ష్మీ సాగర్, వై.రమాదేవి, యం.ఆనందరాజు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు కె.రంగన్న గారుల చేతుల మీద విద్యార్థుల సమక్షంలో సత్కారం ఘనంగా జరిగింది. ఉపాధ్యాయులు మాట్లాడుతూ ..విద్యార్ధి దశలోనే ప్రతిభకు పదును పెట్టి దేశాభివృద్ధికి తోడ్పడలాని హితువు పలికారు. సన్మాన గ్రహీత గద్వాల సోమన్న విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ.. తన వృద్ధికి అప్పటి తన గురువులే కారణమని ఉద్వేగంతో కృతజ్ఞతాభావం వెల్లడించారు."కష్టఫలి, అభ్యాసం కూసు విద్యని" పలు సూక్తులతో బడి పిల్లలను ప్రభావితం చేశారు.