ముష్కర్ల దాడిలోన
పచ్చని పహల్గాం నేలమీద
చిందిన అమరుల రక్తం..
భారతీయుల గుండెల్లో సలసల మరిగి
ఆపరేషన్ సింధూరమై..
ఉరుములేని మెరుపులాగా
ఉగ్ర శిబిరాలను కాల్చి వేస్తుంటే..
ఆ ఉగ్రవాదదేశం బూడిదెప్పుడు అవుతుందని
ఎరుపెక్కిన కళ్ళతో
ఎదురు చూస్తున్నాడు సగటు భారతీయుడు..
చందుపట్ల రామమూర్తి
రిటైర్డ్ టీచర్.