అమ్మ లేని జీవితం శూన్య
అమ్మ జన్మనిస్తుంది లాలిస్తుంది పాలిస్తుంది
నవ మాసాలు మోసి తన రక్తపు ముద్ద
ను పిండం గా చేసి బ్రహ్మ తర్వాత సృష్టి నిర్మాణం లో అమ్మే అగ్రస్థానం.వేదాలు కూడా
మాతృదేవోభవ అని అంటారు.తండ్రి, గురువు చివరికి దేవునికి ముందు వరుసలో అమ్మ
పేరు ఉంది.ఎన్ని డెన్ ల నొప్పి భరించి
శిశువు కోసం తపిస్తుంది.అమ్మ నీకు శిశువు
కావాలా,నీవు బతుకలా అనే పరిస్తితి లో
శిశువు కావాలి అని అంటుంది.అటువంటి
అమ్మ స్థానం కాలం మరీనా కొంత వ్యవహారం
మరిందికావచ్చు నిజమైన మాతృ ప్రేమ లో
మార్పు రాలేదు. అయితే వృద్ధాప్యంలో
తల్లిదండ్రులను వృద్ధాశ్రమం లో పడేస్తున్నారు
అనేక హింసలు పెడితున్నారు.ఇంటి నుంచి
గెంటి వేయడం కూడా జరుగుతుంది.ఈ సంఘటనలు కొకళ్ళు.అందుకే ప్రభుత్వం
ఎన్నిచట్టలు చేసినా సమాజం లో మార్పు
రానిది ఏమి చేయలేము. మనిషి గగన తలం లో విహరించిన తల్లి కడుపులోనే పుట్టేది
అందుకే ఢిల్లీకి రాజు అయిన తల్లీకి కొడుకే
వృద్ధాశ్రమాలు పెరిగితే గొప్ప కాదు బాధ్యత
తగ్గుతుంది.చనిపోయిన తరువాత దింపుడు
కళ్లెం వద్ద అమ్మ అని పిలిచినప్పుడు ఏర్పడే
భావోద్వేగం వేరు. చనిపోయిన తరువాత
దినాలు,తద్దినాలు పెట్టడం కాదు.జీవించి
ఉన్నప్పుడు బుక్కెడు బువ్వ పెట్టండి.మాతృదినోత్సవలు చేయడం కాదు అమ్మనురోజు ప్రేమిద్దాం. నేటి తరానికి నేర్పుదాం.మనం మన తల్లిదండ్రులను దూరం
చేస్తే అదే మన పిల్లలు కూడా చేస్తారు.ముందు
ఎద్దు ఎట్లా పోతే తరువాత ఎద్దు అట్లా పాతది
ఉమాశేషారావు వైద్య