పత్రికా ప్రకటన/ హైదరాబాద్
స్నిగ్ధ మాధవికి సన్మానం
ప్రముఖ రచయిత్రి,కవయిత్రి, ఉపాధ్యాయుని శ్రీమతి స్నిగ్ధ మాధవిని ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు, కవులు రచయితర పాత్ర నవ సమాజ నిర్మాణంలో ఎంతో ఉన్నదని, ఉత్తమ ఉపాధ్యాయునిగా వెనుకబడిన ప్రాంత విద్యార్థులకు సేవలు అందిస్తూనే రచనలు చేస్తున్నారని సాహిత్యంలో ఈమె ముందు ముందు ఉన్నత స్థాయిలో రాణిస్తుందని ఆశిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నవభారత నిర్మాణ సంఘం అధ్యక్షులు సూరేపల్లి రవికుమార్ పాల్గొన్నారు