నిత్య కళ్యాణం పచ్చ తోరణం .....గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా

నిత్య కళ్యాణం పచ్చ తోరణం .....గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి, నాగర్ కర్నూల్ జిల్లా


నిత్య కళ్యాణం పచ్చ తోరణం

మా తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్ సారు
ముందుకొచ్చి నాయకత్వం వహించారు
ప్రాణాలకు తెగించి తాను చేసెనుగా నిరాహార దీక్ష
ప్రత్యేక రాష్ట్రం సాధించి ప్రజలకు కలిగించెను రక్ష !

జనం కలలుగన్న ప్రాజెక్టులన్ని గూడ వచ్చే
దినాం పారేటి నీళ్ళ చూసి వారి మనసు మెచ్చే
ప్రజల చేతుల్లోకి పాలనా పగ్గాలు ఇక వచ్చే
ప్రభుత్వ పాలన అందరికీ మా బాగా నచ్చే!

బీడుబడిన పొలాలకు  అందుతున్నది నీరు
గతంలో నీరందక ఔతుండెను బేజారు
తకరారు అన్నది ఇప్పుడు వారిలోన లేదు
వ్యవసాయం అన్నది  వారికి కానె కాదు చేదు

గొర్రెలు బర్రెలు అందెను అందరికి
ఉద్యోగాలు కూడా వచ్చే కొందరికి
ఆటో రిక్షాలు అందె మరికొందరికి
రైతుబంధు డబ్బులు ఇంకొందరికి !

బ్యాంక్ అప్పు డబ్బులు జనం అందుకున్నరు
బ్రతుకు చిత్రాన్ని పూర్తిగా వారు మార్చుకున్నరు
సుఖ సంతోషాలతో వారు ముద్దుగున్నరు
రోజు రోజు వారుమరింత అభివృద్ధి చెందుతున్నరు !

ఇలా అన్ని విధాలా సహాయం
అందుతున్నది చెందుతున్నది
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర మందు నిత్యకళ్యాణ పచ్చతోరణం విందు !

- గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి,
నాగర్ కర్నూలు జిల్లా.

0/Post a Comment/Comments