శ్రీ శ్రీ ఒక విప్లవ చరిత్ర - ఎం వి స్వామి

శ్రీ శ్రీ ఒక విప్లవ చరిత్ర - ఎం వి స్వామి



 శ్రీ శ్రీ ఒక విప్లవ చరిత్ర 


పేదసాదల గుండె భాషను 

మండుటెండలో నిలబడి 

నినదించిన విప్లవ కోకిల అతడు!

నిజాన్ని నిప్పు దోసిళ్ళలో  

నిర్భయంగా విను వీధుల్లో చూపి  

వ్యవస్థల్లోని డొల్లతనాన్ని 

తేట తెలుగులో తెరపై... 

ఆవిష్కరించిన అక్షర జ్వాల అతడు!

అణగారినవర్గాల ఆక్రందనను 

సాహీతీ ఆరుగెక్కి అరచి 

అందరికీ అర్ధమయ్యే రీతిన 

అక్షర గర్జనలను చేసిన 

అభ్యుదయ కాగడా అతడు!

సాంప్రదాయాల చెదలు దులిపి 

నవయుగ నాణ్యాతా పద్దతుల 

నిగ్గు తేల్చి భావితరాలకు 

నూరిపోసిన ప్రజా భక్తుడతడు!

అక్షరాలను తట్టిలేపి 

తుప్పుబట్టిన పండిత భాషకు 

తిలోదకాలు ఇప్పించ 

యాసప్రాసల ఇందనాలతో 

జగన్నాధ రథ చక్రాలను 

ప్రతి శ్రామిక గల్లీలోనూ నడిపించి 

సూటి ప్రశ్నల సూదులతో... 

చేవ చచ్చిన వ్యవస్థలకు 

చేగువేరా చికిత్సను అందించిన 

నిస్తేజ మేఘాలు ముట్టడించని 

నిత్య జ్వలిత భాస్కరుండు అతడు!

అతడొక చరిత్ర!వన్నె తగ్గని 

విప్లవాక్షర సత్య జ్వలిత పవిత్ర! 


- ఎం వి స్వామి 

చోడవరం, విశాఖ జిల్లా, ఆంద్రప్రదేశ్.

0/Post a Comment/Comments