సెల్ఫోన్ ఎవరికి..!?(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

సెల్ఫోన్ ఎవరికి..!?(కవిత),ముహమ్మద్ ముస్తఖీమ్ విన్నర్

సెల్ఫోన్ ఎవరికి..!??(కవిత)
*******✍🏻విన్నర్*******
దారి తప్పుతున్నారు పిల్లలు..,
సెల్ ఫోన్ పిల్లల ఆట వస్తువైంది..!
మారాం చేసి మరీ గుంజు కుంటున్నారు..!
తల్లిదండ్రులు ఏమన గులేకున్నారు..!
ఇప్పుడేమో చిన్నపిల్లలు గనుక వీడియో గేమ్స్ ఆడుతున్నారు..!
రేపు పెద్దయ్యాక నీలి చిత్రాలు చూసి తీరతారు..!??
అందుకే ఇప్పుడే నియంత్రించాలి..,లేకపోతే రేపొక అసాంఘిక సమాజ నిర్మాణానికి బాటలు వేసిన వారవుతారు.. 
తలిదండ్రులారా..
కాస్త ఆలోచించండి..!?
"సెల్ఫోన్ ఒక మాట్లాడే పెద్దల సాధనంగా" హిత బోధ చేయండి..!??
ఇప్పుడు పిల్లలుగా చదువే మీ జీవితం అన్నట్లు చెప్పాలి..!
ఇంకా కంటి సమస్యలు తీవ్రమై పోతాయి..!
సోడా బుడ్డి కళ్లద్దాలు గిఫ్ట్ గా ఇచ్చిన వారవుతారు..!??
పెద్దయ్యాక మిమ్మలని ప్రశ్నిస్తారు..పిల్లలు.,
చివరకు తల్లిదండ్రులే దోషులవుతారు..జాగ్రత్త..!??
సెల్ఫోన్ తో పిల్లలు అన్ని రకాలుగా చెడిపోతారన్నది విశ్వసించలేని వాస్తవం..!??
నేరాలకు పాల్పడి నేర చరితులు గా దర్శించి తీరతారు..!
అందుకే పెను ప్రమాదం పొంచి ఉందని గ్రహించండి..!??
పిల్లలకు తెలియదు గనుక పెద్దలు సెల్ఫోన్ గుణ దోషాలు చర్చించాలి..!

✍🏻విన్నర్.
ముహమ్మద్ ముస్తఖీమ్,
కొల్లాపూర్, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ.

0/Post a Comment/Comments