చదువంటే మార్కులేనా,
సంస్కారం నేర్పని చదు వు!
చదువుకుంటేబాగుపడతారన్నది ఎవరైనా చెప్పే మాట. గతంలో చదువు కునేవారు. మరిప్పుడు చదువు కొంటున్నారు.చదువు జీవితాన్ని బాగు చేయాలి. అదే నిజమైన చదువు. ఇప్పటిచదువులుజీవితానికిపనికొస్తన్నా యా? అంటే సందేహమే. మ నం ఇప్పుడుపాఠాలుమాత్రమేచదువుతున్నాంగొప్పగా మార్కులు సాధి స్తు న్నాం.దీనివల్లఉద్యోగాలు, డబ్బు లొస్తున్నాయి. జీవితం సౌకర్యవంతంగా నడిచిపోతోంది.అయితే మనకు తెలియని ఎన్నో సమస్యలు పెరిగిపోతు న్నాయి. ఇది ఎవరికీ ప ట్టడం లేదు. ఇప్పటికే ప రిస్థితులు చేయి దాటు తున్నాయి.మరికొంతకాలానికిసమస్యలుమరింత గా పెరిగే పరిస్థితులు కని పిస్తున్నాయి.గతంలో చ దువు కార్పొరేట్ స్కూ ళ్లు ప్రవేశించని కాలమది. ఎ వరైనా వీధి బళ్ళో చదు వుకునేవారు. జీతాలు లేకున్నా పంతుళ్ళు చక్క గా చెప్పేవారు. విద్యా ర్థు లు హాయిగా చదివేవారు. సాయం త్రంవేళల్లోఆటలుం డేవి. హోంవర్కుల ఒత్తిడి లేని కాలమది. బిడ్డలకు పాఠా లు వంట బడితేచాలనితల్లిదండ్రులు భావించేవారు.అయ్య వారికి కోపం వస్తే బెత్తం లేసేది. ఒంటిమీద వాత పడేది. ఇంటికెళ్లి చెబితే ఇంట్లో వాళ్లే ఇంకో రెండు కొట్టేవాళ్ళు.గురువులంటే అంద రికీ ప్రేమ. వాళ్లు వి ద్యార్థుల జీవితా లను బా గు చేస్తారని నమ్మే వాళ్ళు న్న కాలమది. కొంచెం వెన కబడ్డాడ నుకుంటేసాయం త్రం పూట అయ్య వారి ఇంటికెళ్లి చదువుకునే వారు. డబ్బులడిగే రోజు లు కావవి. ఇచ్చుకునే స్థోమత అందరికీ ఉండేది కాదు. తమ దగ్గర ఏముం టేఅదేఇచ్చేవాళ్ళు.పంతు ళ్ళుమొహమాటంగాతీసు కునేవారు. గుమస్తా నుం చి ఐఏఎస్ దాకా అదే బడి.విద్యార్థిశ్రద్ధనుబట్టిపురోగతిఉండేది.చదువుతోపాటుఏ విద్యార్థయినా ఇంట్లో పని చేయాల్సిందే. అమ్మాయిలు తల్లికి చేదో డు వాదోడుగా ఉండేవా రు.అబ్బాయిలుబజారుకు వెళ్లడం నుంచి అన్ని పనులుచేసేవారు.అప్పట్లో ఇంత ధనం చలామ ణిలో లేదు. జానా బెత్తె డు జీతాలు. అత్తెసరు కూలీలు.వాటితోనే కు టుంబాలు నడిచేవి. గడిచేవి. అయినా నీతి నియమాలు తప్పేవారు కాదు. కష్టం చేయడం నా మోషికాదు. గర్వం. క ష్టం లోనే ఆనందం. అందరి తోకలిసిపంచుకోవడంలో గొప్ప సంతోషం. అదే ఆ కాలపు గొప్ప నీతి, రీతి. ఇందులోనే బంధుప్రీతి. ఆప్యాయతలు కురిసేవి. ఉన్నదాంట్లోస్నేహితులకు చేయూత. జీవితంలోని మాధుర్యం తల్లిదండ్రు లతో సహా బిడ్డలకు అం దేది. తల్లిదండ్రుల కష్టం బిడ్డలకు తెలిసేది. ఉమ్మ డి కుటుంబాల్లో నాయన మ్మ తాతయ్యలు ఎన్నో చెప్పేవారు. బిడ్డలతో అనుచితంగా ప్రవర్తిస్తే తల్లిదండ్రులనుకోప్పడేవా రు.కొన్నిసార్లుఅన్నదమ్ము ల బిడ్డలు ఒకే కుటుంబం గాపెరిగేవారు.‘సర్దుకుపోవడం’ ఏంటో స్పష్టంగా తెలిసేది. ఒకరి కోసం మ రొకరి త్యాగాలుండేవి. దా న్ని గొప్ప బాధ్యతగా భా వించేవారు. ఒకరికి తగ్గి నా, మరొకరికి పెరిగినా
పొరపొచ్చా లుండేవి కావు.చిన్న పెద్ద గౌరవం అణువణువునా ఉండేది. బిడ్డలకు తెలియకుండానే గొప్ప సంస్కారం అబ్బేది.
మరిప్పుడు కార్పొరేట్ స్కూళ్ల జమానా. ఎల్కేజీ కే లక్ష రూపాయలు తీసు కునేస్కూళ్లున్నాయి. ఈ
ఫీజులు కట్టడానికి తల్లి దండ్రులిద్దరు ఉద్యో గాలు చేయాలి. హడావుడి జీవి తం,నాయనమ్మతాతయ్య లు మచ్చుకైనా లేని కుటుంబాలు. బిడ్డలతో మాట్లాడలేనితల్లిదండ్రుల నిస్సహాయత. యాంత్రిక జీవనం. తల్లిదండ్రుల బిడ్డల మధ్య కొరవడిన ప్రేమానురాగాలు.సౌకర్యా లకేతప్పఅనుబంధాలకు ఆస్కారం లేని జీవితాలు. బంధుప్రీతి అసలే లేదు. చిన్నా, పెద్ద- మంచి చెడ్డ చెప్పగలిగినతల్లిదండ్రులకు సమయం లేదు. గురు వుల గురించి చెప్పే పెద్ద వాళ్లు లేరు. గురువులు కోప్పడితే, ఓ దెబ్బ కొడితే ఓదార్చే పెద్దలు లేరు.బిడ్డ లను ఎందుకు కొట్టారని ప్రశ్నించే తల్లిదండ్రులే ఎ క్కువ. స్కూలికి వెళ్లడం అంటే మార్కులు తెచ్చు కోవడమే ప్రాతిపదిక. పాఠాలు మనసుకు ఎక్కా యా లేదా అన్నది ఎవరికీ అక్కరలేదు. 95 మార్కు లొస్తే మరి ఆ ఐదు సంగ తేమిటనడిగే తల్లిదం డ్రు లేఎక్కువ,జీవితమెక్కడ.
జీవితంలో చదువు ఒక భాగమే. అంతేకానీ చదు వే జీవితం కాదు. ఈ విష యం ప్రస్తుత సమాజం మర్చిపోయింది. మార్కు ల గోలలో జీవితం మంట కలిసిపోయిందివ్యక్తిత్వం’ నాశనమైపోయింది.తల్లిదం డ్రులు బిడ్డలకుఇవ్వా ల్సిందిమంచిజీవితం.మంచి సంస్కారం. మంచి నడవడిక. వ్యక్తిత్వం. చదువుల హడావుడిలో ఇవన్నీవెనకబడిపోయాయి. వ్యవహార జ్ఞానంపూ ర్తిగా కొరవడింది. బజా రు కెళ్ళికనీసంకూరగాయలు తెచ్చుకోలేని పరిస్థితి. త మ పనులు తాము చేసు కోలేనిదుస్థితి.బంధువులెవరు,వారి స్థానమేమిటి వారినిఎలాఆదరించాలి?ఇవేవీ తల్లిదండ్రులు నేర్ప డం లేదు. వాళ్లను ఆహ్వా నించే పరిస్థితి పెద్దలకే లేదు. మార్కులు మాత్రం బాగా ప్రాధాన్యం పొందా యి. మావాడు గొప్ప మెరిట్. 90 మార్కులకు ఎప్పుడూ తగ్గడు. ఇది తల్లిదండ్రులమెచ్చుకోలు. ఇంకా దారుణం.బిడ్డలకు గొప్ప చదువు నేర్పాలని భావించేతల్లిదండ్రులన్నా రు. నిజంగా ఇది గొప్ప విషయం. ఆ ధ్యాసలో పడి జీవితాన్ని మరిచి పోయే తల్లిదండ్రులు తయారయ్యారు. కార్పొ రేట్ స్కూళ్లు దీన్నిసొమ్ము చేసుకుంటున్నాయి. బిడ్డ లను చిన్నప్పుడే తీసుకెళ్లి రెసిడెన్షియల్ పాఠశాలల్లో వేస్తున్నారు. భారీగా ఫీజు లు కడుతున్నారు. కార్పొ రేట్ స్కూళ్ళు ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఒకటే చదువు. మధ్యలో భోజనాలు. ఇదే జీవితం.ఇదేలక్ష్యం.ఇందు లో తల్లిదండ్రుల ప్రేమాను రాగాలు మంట కలిసిపో యాయి. బంధువులెవరో తెలియదు. తమ చదువు కోసం తల్లిదండ్రులు ఎం త కష్టపడుతున్నారో తెలి యదు. గౌరవ మర్యా ద లు తెలియవు. సమాజ జీవితం అసలే తెలియ దు. తెలిసిందల్లా బట్టి ప ట్టడం.మార్కులుసాధించ డందానికి తల్లి దం డ్రులు మురిసిపోవడం. వాళ్లకు ఉద్యోగాలు లభించి లక్ష లు ఆర్జించడం. ఇలా పెరి గిన వాళ్లకు తల్లిదండ్రుల ప్రేమా, కష్టం ఏమీతెలియ వు. తెలిసే అవకాశమే లేదు. తల్లిదండ్రులు చేసి నట్లుగానే వృద్ధాప్యంలో వారిని ఆశ్రమాల్లో వేస్తు న్నారు. ఫీజులు కడు తున్నారు. తల్లిదండ్రులు చేసిందేబిడ్డలుచేస్తున్నారు. ఎవరిని తప్పు పట్టా లి,ఎలా తప్పు పట్టాలి ఇదేనా చదువులు నేర్పిన సంస్కారం? ఎలా మారా లో అందరికీ తెలుసు,కా నీ ఎవరిలోనూ మార్పు ఆనందం ఎక్కడినుంచి వస్తుంది ఆలోచించండి
ఇంగ్లీష్ లో వచ్చిన వ్యాసానికి తెలుగు
అనువాదం
వైద్య.ఉమారాణి
కామారెడ్డి