వానమ్మ కురవమ్మ

వానమ్మ కురవమ్మ

_
వర్షమా వందనమా
మా పై అలుక బునకు
కోటి ఆశలు నీపైనే
వ్యవ(సాయం)తెలిసి
నెల తల్లిని నమ్మిన
రైతన్న ఆశలు ఆడియాసలు
చేయకు
అకాల వర్షం తో ఆగం
చేయకు
చెను చెలక తపన
పడు తున్నాయి
నగల్లాసళ్ళు దుక్కి దున్ని
విత్తనం ఆకలి తీర్చే
నీరు అమ్మావు జీవుల
మనుగడవు
యల్లపుటరావమ్మా
ఎలినోను ఎదిరించు అమ్మ
నీకోసం అభిషేకము చేసాం
కప్పకప్ప కవిడి ఆడం
ఊరు పండుగలు
చేసాం
వర్షమా నీకు వందనం
మేఘమై రా అమ్మ
చినుకయ్యి నేలను
ముద్దాడు
రైతు బతుకుల్లో రౌతు
కాకు
ఆకాశం వంక
బిత్తిరీ చూపులతో
రైతాంగం చూస్తుంది
అలక బునకు
మమ్ముల్ని ఆగం చేయకు
వర్షమా శతకోటి
వందనాలు నీ కు
కరుణించు కరువు
వర్షమా
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
జి. జె.సి దోమకొండ
_
Uploaded Image

0/Post a Comment/Comments