శాంతిదూత ముహమ్మద్ ప్రవక్త...
చిన్న వయసులోనే తల్లి తండ్రి తాత మరణించినా
పినతండ్రి పెంపకంలో పెరిగి పెద్దవాడైన ముహమ్మద్
ఖురేష్ తెగల బహుదేవతావిగ్రహారాధనకు బద్దవ్యతిరేకి
ఆధిపత్యంకోసం దాడులు దండయాత్రలు చేసుకుంటూ
రక్తదాహంతో పగప్రతీకారాలతో రగిలిపోయే తెగలతో
బద్ర్...ఉహద్...ఖందఖ్...హునైనుల్లో యుద్ధభేరీ మ్రోగించి
అరేబియా తెగల తిరుగుబాటుదారులను అణచివేసి
రక్తపాత రహిత ఆక్రమణతో ఇస్లామిక్ సామ్రాజ్యస్తాపనచేసి
కాబా గృహంలో మక్కావాసులు భక్తి శ్రద్ధలతో ఆరాధించే
360 విగ్రహాలను తొలగించిన మహాయోధుడు ముహమ్మద్
ఇస్లాం అంటే...సహనం చూపించడం...ఓర్పు వహించడం
దానధర్మాలు చేయడం దుష్కర్మలకు దూరంగా ఉండడమని
అల్లా ఒక్కడే దేవుడని అందరూ విధేయులుగా ఉండాలని...
అల్లా అంటే.....కరుణామయుడని అపార కృపాసాగరుడని సర్వలోకాల సృష్టికర్తని.... తీర్పుదినానికి అధిపతియని...
సర్వశక్తిమంతుడని మహాజ్ఞానియని...మహిమాన్వితుడని
ఖురాన్ అంటే...ఒక పవిత్రగ్రంథమని...పఠించిన వారికి
ప్రవచనాలన్నీ పాటించిన వారికి...మరణాంతరం కూడా జీవితం ఉంటుందని...అమృతసందేశాన్ని అందించి
ప్రపంచశాంతికై పరితపించిన...దైవాంశసంభూతుడు
సమతా మమతల మహోపకారి...ఆ ముహమ్మద్ ప్రవక్త
570వ. సం.ఏప్రిల్ 20న మక్కాలో జనియించే...
632వ. సం. జూన్ 08న మదీనాలో మరణించే...
ఎడారి బ్రతుకుల్లో ఒయాసిస్సులను నింపే...
చీకటి జీవితాల్లో వెన్నెల వెలుగుల్ని ప్రసాదించే....
సమస్త మానవాళికి మంచిని...మానవత్వాన్ని పంచే...
శాంతిని...సమానత్వాన్ని...సౌభ్రాతృత్వాన్ని ప్రబోధించే...
దివినుండి భువికేగి ధృవతారగా దైవదూతగా ప్రకాశించే...
(మితృలందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు...)
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502