ఏది నీ కులం
ఏది నీ మతం
అడిగి చూడు నీ హృదయాన్ని
కులాల కుంపటి ఎందుకని
కుల జ్వాల లో రగలకు
నిన్ను దహించివేస్తుంది.
ప్రేమ పంచి చూడు
అది నిన్ను అక్కున చేర్చకుంటుంది
కులాలతో అడ్డు గోడలు కట్టకు
హృదయ ద్వారాలు తెరిచి చూడు
చిరు దరహాసం తో ఆహ్వానించు
అది నిన్ను ఆదరించి ప్రేమిస్తుంది.
కులం ముసుగులో మానవత్వం మరువకు
కన్నపేగును దూరం కానీకు
కులాల అంతరాలను తగ్గించు
నిన్ను నీవు నిరూపించు
వాస్తవమెరిగి జీవించు
మనీషిగా మారి కృషించు
కుల రహితం గావించు
సమాజ స్పందన రూపొందించు
నీతో రాని కులం కోసం ఎందుకు ఆరాటం
నీకవసరం లేని మతం వదిలించు
కుల జాడ్యాన్ని రూపుమాపు
అమరుడవైనా కీర్తించేలా ప్రవర్తించు
దొడ్డపనేని శ్రీవిద్య
విజయవాడ