ఆహా అమ్మ అనే పిలుపు
అమ్మ ఆహా!
ఆ పదమే ఓ అద్భుతం
ఆ పదమే సృష్టి పులకింత
ఆ పదమే బిడ్డలకు ఊరింతా
ఆ పదమే పంచభక్ష పరమాన్నం
షడ్రుచుల సమ్మేళనం
నవరసాల మేళవింపు
సప్తస్వరాల పలకరింపు
నల్లనిమబ్బు చల్లనిగాలి తాకి
వానజల్లు కురిసినట్లు
పుడమితల్లి పై జడివాన చిలకరించునట్లు
ఉషోదయ తొలికిరణాలు తాకినట్లు
పువ్వు పరిమళించునట్లు
మనస్సున కొండంత భారం
ఒక్క ఉదుటున దింపేసినట్లు
మహావృక్షం కింద చల్లని నీడలో
సేద తీర్చుకున్నట్లు
సెలయేటి నీటితో దాహార్తి తీర్చు కున్నట్లు
కష్టాలన్నీ కడతేరినట్లు
పూవులలో సుగంధం
భువిలో స్వర్గం
స్వచ్ఛమైన సువర్ణం
వదల లేని ఆభరణం
దేవుడా అమ్మ అనే పదం లో
ఏం కలిపావయ్యా
మనసు మొత్తం తేనేకన్నా తీయదనం తో
మంచుకన్నా చల్లదనంతో
హృదయం పులకించి పరితపిస్తుంది అమ్మ అనే పదం తో
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
సాలూరు
విజయనగరం జిల్లా
