భోగి పళ్ళు బొమ్మల కొలువు గాలిపటాల సందడే సంక్రాంతి
భోగ భాగ్యాలనందించే భోగి,
సమస్త జగత్తుకు క్రాంతినిచ్చే సంక్రాంతి
రైతును రాజుగా కొలిచి
ఎద్దును నందిగా పూజించే కనుమ
ఇలా ప్రతి పండుగ వెనుక ఒక పరమార్థాన్ని, సమాజహితాన్ని కాంక్షిస్తూ
ప్రకృతిలో పరమాత్మను చూస్తు
హైందవ సాంప్రదాయంలో
ప్రతి రోజుకు ఒక విశిష్టత
ప్రతి పర్వదినం సహేతుకం.
ఖగోళ విజ్ఞానాన్ని మిళితం చేస్తూ
మన పూర్వీకుల, వేద వాంగ్మయం లో పుట్టిందే జాతకం.. ఇందుకు తార్కాణం
ఇదే మకర సంక్రాంతి.
ఈ ముక్కనుముల పండుగ
ఇంటిల్లిపాదికి.. సంతోషాల ఆనందమయం
తెలుగువారి లోగిళ్ళలో సంక్రాంతి వైవిధ్యం
అటువైపు కోడిపందాల దోబూజులాటలు
బొమ్మల కొలువుతో పిల్లలకు ఆటవిడుపు
ఇటు కొత్త పంట ఇంటికి చేరిందని
సంతోషంలో ఎన్నెన్నో పిండి వంటలు
అదే సకినాలు అరిసెలు, జంతికలు.
ఈ సెలవుల్లోకి ఇంటికి చేరుతారు
దూర దూరాన ఉన్న పిల్లలు పెద్దలు
ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చేది మొదటి పండుగ.. అదే సంక్రాంతి భోగి కనుమ
భోగి మంటలు భోగిపళ్ళతో మొదటి రోజు
కేరింతల సవ్వడి.. సంక్రాంతి న
రకరకాల వంట రుచులతో ప్రియం ప్రియం..
గాలిపటాల ఆటలతో చిన్నారులకు
కనువిందు పతంగుల పండగ. అందరి జీవితాల్లో సంక్రాంతి పండుగతో నూతన కాంతులు వెళ్లి విరియాలని ఆ సంక్రాంతి లక్ష్మిని
కనుమ రోజున గోమాతలను ప్రార్థిద్దాం