*పంచపది*
*18 / 10 / 2021*
*27*
ధనం పోయి దరిద్రుడు
పాపం పోయి పుణ్యాత్ముడు
కళ్ళు పోయి గ్రుడ్డివాడు
కాళ్ళు పోయి అవిటివాడు
మనసుతో చూసిన వీళ్ళే కదా నావాబులు *శ్రీ*
************************
*28*
ప్రకృతికి అందం పచ్చదనం
మగువకి అందం అలంకారం
పాముకి పగడం భూషణం
రాజుకు బలమే ఆయుధం
ఎవరికి ఏది ముఖ్యమో తెలిసి మురుసెను *శ్రీ*
**************************
*29*
కనుల చాటు కలలు
మనసు చెప్పుకున్న ఊసులు
పెదవి మాటు మాటలు
కలసి నడచిన అడుగులు
చెరగని జ్ఞాపకాలుగా మిగిలేనా, నెరవేరేనా *శ్రీ*
***************************
*30*
యజమాని కోసం సేవకుడు
ప్రజల కోసం నాయకుడు
దైవం కోసం మానవుడు
సత్యం కోసం ఉత్తముడు
నిజమెరిగిన సత్యం కదా ఇద *శ్రీ*
****************************
*31*
జారిపాడిన కన్నీటి
బరువు
నిర్లక్ష్యపు తల పొగరు
కోపం వెనుక బాధ తీరు
నవ్వు తెచ్చే తంటాల పోరు
ఆర్చి తీర్చే వారు ఉంటారంటారా *శ్రీ*
✒️📖✒️📖✒️📖✒️
*దొడ్డపనేని శ్రీవిద్య*
విజయవాడ
సోమవారం
దొడ్డపనేని శ్రీవిద్య