బతుకమ్మ:ఐశ్వర్య రెడ్డి

బతుకమ్మ:ఐశ్వర్య రెడ్డి

శీర్షిక:బంగారు బతుకమ్మ

బతుకమ్మ బతుకమ్మ 
మా బతుకే నీదమ్మా 
చల్లంగా చూడమ్మా 
మా తల్లి గౌరమ్మ 

పసుపు కుంకుమ నిచ్చేటి 
సౌభాగ్యం నీవమ్మా 
పూలలోనా కొలువైన 
బంగారం నీవమ్మా

 పల్లెనిడిచిన బంధాలు
 ఇల్లు చేరినీయే బతుకమ్మ
పరిమళాల పూల తోటి 
తీర్చిదిద్దినమే బతుకమ్మ 

అందాల ఆడపడుచులు 
నిన్ను ఎత్తిరే బతుకమ్మ 
ఊయ్యాల పాటలతో 
 ఆటలాడిరే బతుకమ్మ 

సత్తు పిండి వాయనాలు 
ఇచ్చిపుచ్చుకుంటిమే బతుకమ్మ 
నవదిన పండుగ చేసి
 నిన్ను సాగనంపిరే బతుకమ్మ

ఇంతులను దీవించ
ఏటేటా రావమ్మా
బతుకు నిచ్చే బతుకమ్మ
మా బతుకే నీదమ్మ 
బంగారు బతుకమ్మ పోయిరావే మాయమ్మ


1/Post a Comment/Comments

Unknown said…
Nice 👏👏👏👏👏👏👏