కలువ సొంపులు
పచ్చని చీర ను చుట్టిన చెరువు
సింధూరపు చుక్కలతో అలంకరించుకుని
నీటి అలలతో తానమాట్లాడుతూ
వీచే పయ్యెర తాకిడికి ఉయల లూగుతూ
వెన్నెల రేడు రాకకై
వికసించిన కలువల ఒంపుసొంపులు
కనువిందు గాంచే ఆ సుందర దృశ్యం
చూచుటకు వేయి కనులు చాలునా!?
విస్సాప్రగడ పద్మావతి
హైదరాబాద్