శీర్షిక *పర్యావరణం ఆత్మఘోష*
నన్ను కాపాడండి..మీమేలు కోసం..
నేను ఎవరో తెలుసా పర్యావరణాన్ని
నన్ను కాపాడండి..మీమేలు కోసం..
ఓ మనిషి ..స్వార్దపరుడవని తెలుసు..అందుకే..
నీ,,రక్షణకై నన్ను రక్షించు..
నా ఒడిలోని బిడ్డలు మీరు-
మీ ఊపిరికై..నేడైన ఒక మొక్కను నాటండి..మ్రానై
మీ పిల్లలకు నీడనిస్తాను,
వేసవిలో..నిన్ను అక్కున చేర్చుకుంటాను,
చలిలో..నెచ్చెలిలా..
పచ్చదనం పర్చుకుని
పరువంతో ఆనందపెడ్తాను..
అందుకే..అన్నరు పెద్దలు
వృక్షో రక్షతి రక్షితహ
నేను ధరిత్రిని..భుమాతను
పడేసె ప్రతి ఎంగిలితో..
నా గుండేలో గునపంలా దిగుతోంది..
ప్లాస్టీక్ కిక్కుతో..మీ బతుకే
అవవుతుంది...ఓ చిక్కుముడీ.
అనుదినం కాలుష్యంతో
దినదిన గండంలా..నూరేళ్ళూ ఆయుష్హు కరువై.
.మీ బ్రతుకు చిద్రమవుంది
నేను వాయువును..సర్వవ్యాప్తిని
మీకు జీవాధరాన్ని,
నిర్లక్ష్య కలుషితం..నామనసెంతొ కలతం.
నా కరుణతోనె వరుణుడు కరుణిస్థాడు..
సమతుల్యం లేని పర్యావరణం..
జీవులకు భవితవ్యం.షూన్యం..
అందుకే-పంచభుతాల
పర్యావరణ పరిరక్షణే మా రక్షణగా
నేటి నుండి పతిన బూనుదాం.
హామీ పత్రం ఈ కవిత నా స్వీయ రచన ఎవరికి అనుకరణ అనువాదం కాదని హామీ ఇస్తున్నాను