నేడు ప్రపంచ నీటి పర్య వేక్షణ దినోత్సవం
జల వనరుల సంరక్షణ అందరి బాధ్యత మనుగడకు, సర్వ జీవకోటి జీవనానికి నీరే ప్రాణా ధారం.జలమే జీవం అని తెలి సి కూడా నేడు మన నిర్లక్ష్యం వల్ల నీటి వనరులు కాలుష్య కాసారాలుగామారుతున్నాయిఈ నేపథ్యంలో, నీటి శుద్ధత, సంరక్షణ మరియు సరైన నిర్వ హణపై ప్రజల్లో విస్తృత అవగా హన కల్పించేందుకు ప్రతిఏటా సెప్టెంబర్ 18న "ప్రపంచ నీటి పర్యవేక్షణ దినోత్సవం జరుపు కుంటారు.ఈనేపథ్యంమరియు లక్ష్యం2003లో అమెరికాకు చెందిన క్లీన్ వాటర్ ఫౌండేషన్ ప్రారంభించిన ఈ ఉత్సవం, నే డు ప్రపంచవ్యాప్తంగాఒకఉద్య మంగా మారింది. కేవలం ప్రభు త్వాలు లేదా పరిశోధకులే కా కుండా, సామాన్య ప్రజలు, వి ద్యార్థులు కూడా తమ పరి స రాల్లోని నీటి వనరులను స్వ యంగా పరిశీలించి, వాటి నా ణ్యతను పర్యవేక్షించడమే ఈ రోజు ముఖ్యఉద్దేశం.నీటికాలు ష్యం ఎదురవుతున్న సవాళ్లు పారిశ్రామిక వ్యర్థాలు, రసాయ న ఎరువులు, ప్లాస్టిక్ వ్యర్థాలు మరియుసరైనమురు గునీటి వ్యవస్థ లేకపోవడం వల్ల న దులు,చెరువులు,చివరి కి భూగర్భ జలాలు కూడా వి షపూరితంగా మారుతున్నా యి. కలుషిత నీటిని తాగడం వల్ల కలరా, టైఫాయిడ్, జండీ స్ వంటి వ్యాధులు ప్రబలు తున్నా యి. నీటి నాణ్యత క్షీణించడం వల్ల జలచరాలు మరియు పర్యావరణ వ్యవస్థ కూడా తీవ్రంగాదెబ్బతింటోంది.
పర్యవేక్షణలో ప్రజల భాగ స్వా మ్యంనీటి పర్యవేక్షణ అంటే కేవలం ప్రయోగశాలలకే పరి మితం కాకూడదు.ఆమ్ల త ఉష్ణోగ్రత, కరిగిన ప్రాణవాయు వు మరియు నీటి స్పష్టత వం టి నాలుగు ముఖ్యమైన కొల తలను పరీక్షించే సరళమైన కిట్ల ద్వారా ప్రజలు తమ పరిసరాలలోని నీటినిపరీక్షించ వచ్చు.ఈ సమాచారాన్ని సేక రించి నమోదు చేయడం ద్వా రా ఏ ప్రాంతంలో నీరుకలుషిత మవుతుందో గుర్తించి తగిన చర్యలు తీసుకోవచ్చు.తీసుకో వాల్సిన జాగ్రత్తలు మన బా ధ్యతవ్యర్థాల నియంత్రణ ప్లా స్టిక్, రసాయనాలు మరియు గృహ వ్యర్థాలను జల వనరు ల్లో వేయకుండా నిరోధించాలి.
వర్షపు నీటి నిల్వఇంకుడు గుంతల ద్వారా వర్షపు నీటిని భూమిలోకి ఇంకించి భూగర్భ జలమట్టాన్ని పెంచాలి.నీటి పునర్వినియోగం: గృహాల్లో వాడిన నీటిని మొక్కలకు, ఇతర పనులకు మళ్లించేలా ప్రణాళికలుచేసుకోవాలి.వినాయక నిమజ్జనం ప్లస్ట్ ర్ ఆఫ్ ప్యారిస్ తో చేసి న విగ్రహాలు నీటిలో.కరుగవు దానికి ప్రత్యా మ్నాయ ఎంచుకోవాలి నేటి నీటి సంరక్షణే రేపటి మానవా ళి రక్షణస్వచ్ఛమైన నీరు లభించడం ప్రతి ఒక్కరి హక్కు మాత్రమే కాదు, ఆ నీటిని పరి శుభ్రంగాఉంచుకోవడంమనంద రిప్రాథమికకర్తవ్యం. భవిష్యత్తులో కాదు వర్తమానం లొనే రాష్ట్రాలు ప్రాంతాలు దేశాల మధ్య నీటికి కోసంయుద్దాలుజరుగుతున్నాయి.నీటి పొదుపు లేకపోతే ప్రపంచం ముందు పెద్ద ప్రమా దం పొంచి ఉంది.ప్రపంచ నీటి పర్య వేక్షణ దినోత్సవం సంద ర్భంగా ప్రతి ఒక్కరం మన పరి సరాల్లోని జల వనరులను కా పాడుకుంటామని, నీటి వృధా నుఅరికడతామనిప్రతినబూనుదాం.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
9440408080