నేడు గురు పౌర్ణమి దాని విశిష్టత
అనాది కాలం నుంచి ఆషాడ శుద్ధ పౌర్ణమిని, గురుపౌర్ణమి" అంటారు. దీనినే వ్యాస పౌర్ణ మి గా పరిగణలోనికి తీసుకొని ఆ రోజు దేశం నలుమూలలా గురుపూజా మహోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆ రోజు మునిశ్రేష్ఠుడైనవ్యాసమహాముని జన్మతిధి కనుక ఆ భగవా నుని యొక్క జన్మదినం మాన వ చరిత్రలోనే అది ఒక అపూ ర్వమైన ఆధ్యాత్మికమైన మహా పర్వదినంగా విరాజిల్లుతోంది.
ఈ ఆషాడ శుద్ధపౌర్ణమియొక్క విశిష్ఠత గురించి ఒక చక్కని ప్రాచీన కధ ఉంది. పూర్వం వా రణాశిలో కడుపేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆ త్రేయస గోత్రము గల ఆ బ్రా హ్మణుని యొక్క పేరువేదనిధీ. ఆయన భార్య వేదవతీ. వీరిద్ద రు ఎల్లప్పుడు చక్కని ఆధ్యా త్మి క చింతనతో భక్తి జ్ఞానము కలిగి జీవిస్తున్నారు. వారు సం తానము కోసం ఎన్ని నోములు నోచినా, ఎన్ని వ్రతాలు చేసినా వారికి సంతానము మాత్రం కలుగలేదు.ఇలా ఉండగా ఒ కనాడు వేదనిధికీ ప్రతిరోజు మధ్యాహ్న సమయమందువ్యాసభగవానులురహస్యంగా గంగానదికి స్నానానికి వస్తుం టారని వార్త తెలుసుకుని ఎలా అయినాసరే వ్యాసమహర్షి దర్శనం పొందాలనిప్రతిరోజూవేయికళ్ళతోవెతకనారంభిస్తాడు. ఒక రోజు నదీతీరాన ఒక భిక్షువు రూపం ధరించి దండ ధరుడైన వ్యక్తిని దర్శిస్తాడు.వెనువెంటనే వేదనిధి ఆయన పాదాలను ఆశ్రయిస్తాడు. దాని కి ఆ భిక్షువు చీదరించుకుని కసరికొడ తాడు.అయినా సరే పట్టిన పాదాలను మాత్రము వదలకుండా మహానుభావా తమరుసాక్షాత్తువ్యాసభగవానులని నేను గ్రహించాను. అం దుచేతనే, మిమ్మల్నిశరణుపొందగోరుచున్నానుఅంటాడుఆ మాటలు విన్న ఆ అజ్ఞాత భిక్షువు గంగానది ఒడ్డువైపు నకు నలుదిశలా బిత్తరి చూ పులు చూస్తూ, ఇంకా తనను ఎవరైనా చూస్తున్నారేమో అని తలచి వెంటనే వేదనిధిని ఆప్యాం గా చేరదీసి, నాయొక్క రహస్యం మాత్ర ము ఎవరికీ తెలియకూడదు. ఇంతకీ నీకు ఏమికావాలోకోరుకోఅంటాడు.
మహానుభావా,రేపు నా తండ్రి గారి పితృకార్యము. దానికి తమరు బ్రహ్మ ణార్థమై భోజనా నికి మా ఇంటికి తప్ప కదయచే యవలసిందిగా నా కోరిక అని చెప్తాడు. అందులకు మహర్షి అతని ఆహ్వానాన్ని అంగీకరి స్తాడు.అనంతరం ఎంతో సం తోషంగా ఇంటికి చేరుకున్న వే దనిధి తన భార్యకి గంగానదీ తీరానజరిగినవృత్తాంతమంతా వివరిస్తాడు.మరసటిరోజు ఉదయమే ఇచ్చిన మాటప్రకా రం వారి గృహానికి విచ్చేసిన ఆ వ్యాస భగవానుని ఆ దంప తులుఎంతోఆదరాభిమానాలతో వారిని పూజిస్తారు. అనం తరం వారు దేవతార్చనకు సాలగ్రామం, తులసి దళాలు, పూలు మున్నగు పూజాద్రవ్యా లు సిద్ధం చేస్తారు. వారి పూజ అనంతరం ఎంతో శుచిగా మ డిగా సర్వవంటకాలనుసిద్ధపర చి శ్రాద్ధవిధు లను విధి విధానం గా నిర్వహిస్తారు. అనంతరం ఆ దంపతులు ఆ వ్యాస భ గవానునికి సాష్టాంగ దండ ప్రణామం చేస్తారు. వారి అతి థ్యానికి ఎంతో సంతుష్టులైన ఆ ముని శ్రేష్ఠుడు, ఓ పుణ్య దంపతులారా మీకు ఏం వరం కావాలో కోరుకోండి అంటారు.
మేము నోయని నోము లేదు, చేయని వ్రతం లేదు, అయినాసంతానభాగ్యము మాత్రము మాకు కలుగలేదుఅని బదులు పలుకుతారు.ఓ ఆదర్శ దంప తులారా అందులకు మీరు చింతించవలసిన పనిలేదు. త్వరలోనే మీకు తేజోవంతు లు, ఐశ్వర్యవంతులు అయిన పదిమంది పుత్రసంతతికలిగి, మీరు చక్కని సుఖజీవనము తో జీవితంలో ఎన్నో సుఖభో గా లను అనుభవిస్తూఅంత్యమునవిష్ణుసన్నిధాన్ని పొంద గలరు, అని ఆశీర్వదించి తిరు గు ప్రయాణమవుతున్న వ్యాస భగవానునితో ప్రభూతిరిగి తమ దర్శన భాగ్యము మాకు ఎలా కలుగుతుంది అని వేదని ధి ప్రశ్నిస్తాడు. దానికి వ్యాస మహర్షి బదులుగా ఓభూసురో త్తమా నన్ను మరల మరల ద ర్శించుచూ ఉండాలని మీరు ఎంతో కోరికతో ఉన్నారని నేను గ్రహించాను.అందులకు నన్ను మీరు ఎలా దర్శించగలరోచెప్తా ను, వినండి.ఎవరైనా ఎప్పు డై నా, ఎక్కడైనా సరే మన వేదవే దాంగముల యొక్క రహస్యా లను, ఇతిహాసముల యొక్క గూడార్థాలు ఉపదేశిస్తూ ఉం టారో అతడే నా యొక్క నిజ స్వరూ పంగా తెలుసుకుని అట్టి పురాణ కథ కుడైన వ్యక్తిని సా క్షాత్తు వ్యాసమూర్తిగా భావించి పూజింపవలెను. అట్టి పౌరాణి కు లందరిలోను నేను ఎల్లప్పు డూ ఉంటాను. అదేకాదు ఎవ రైనాస రే,గతకల్పాలలో జరిగి న చరిత్ర విశ్వం యొక్క పూర్వ వృత్తాంతంపురాణగా థలు మున్నగునవి విప్పిచెప్పాలంటే వారికి నా అనుగ్రహము లేనిదె చేప్పలేరు. కావునఅట్టిపౌరాణి కునికి ఆషాఢ శుద్దపాడ్యమి నాడు వారికి గురుపూజ చేసి పూజించవలెనని చెప్పారు.నాటి నుండి నేటివరకు అదే ఆచారము కొనసాగడం మ నం చూ స్తున్నాం అది విన్న వేదనిధి మరో మారువ్యాసభవా నుని మహాత్మాత మను ఏయే రోజుల్లో ఏవిధంగా పూజించా లిసవిస్తరంగా చెప్పండి అని ప్రశ్నిస్తాడు.ఓ బ్రాహ్మణోత్తమా నేను జన్మించిన ఆషాఢ శుద్ధ పౌర్ణమినాడు ఈగురుపూజను శ్రద్ధాభక్తులతో చేయాలి. ఆ రో జు కనుక గురువారము అయి తే, అది మరింతగా శ్రేష్టమైన ది. వస్త్ర, ఆభరణ గోదానము లతో అర్ఘ్య పాదాలతోటి నా రూపాన్ని పూజించు వారికి నా స్వరూప సాక్షాత్కారం లభిస్తుంది అని సాక్షాత్తు వ్యాసమహర్షి చెప్పారు. అప్పటి నుంచి వ్యా సపౌర్ణమి, నేటికీ సర్వులకు అత్యంత పుణ్య ప్రదముగా చెప్పబడుచున్నది. ఈ కధ పూర్వము నారదుడు వైశంపా యనుడికి ఈ గురు పౌర్ణమి యొక్క విశిష్టతవివరించినట్లుగా బ్రహ్మండ పురాణంలోనూ స్వధర్మసింధు అనే గ్రంధము లోను వివరంగా చెప్పబడి యున్నది.వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవేనమోవై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమోనమః
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
9440408080