జీవిత నౌక....!! -- కొప్పుల ప్రసాద్,

జీవిత నౌక....!! -- కొప్పుల ప్రసాద్,

జీవిత నౌక....!!

సాగుతుంది నా జీవిత నౌక 
గమ్యం తెలియని నావలా
దిక్కుతోచని స్థితిలో
ఏ దిక్కు కానరాక నిలబడే...

కదులుతుంది ఆయాసపడుతూ
ఉన్న కాస్త ఆశ తో
చిన్న చిన్నగా అడుగులు వేస్తూ
మనసులో లెక్కలు వేసుకుంటూ...‌

సుడిగుండాలు వస్తున్నాయి
అలలు తాకుతున్నాయి
తిమింగలాలు ఎదురుచూస్తున్నాయి
పగబట్టి నాపైనే కన్నేసి చూస్తున్నాయి..‌

తెలివితో  తప్పించుకుంటే
తృటిలో కొన్ని బయటపడితి
బ్రతుకు తెరువు కోసం
నావికుడనై అంచులకు చేరుకోవాలి...

అగమ్యగోచరంగా జీవితం
జీవం సాగుతుంది తీరం చేరాలన్న కోరికతో
స్వప్నాలు పిలుస్తున్నాయి
బలమైన ఆశలు అలలు తీరం వైపు సాగుతున్నాయి...

పైకి గంభీరంగా ఉన్న సముద్రములా
లోన పిరికితనం వెంటాడుతున్న
ముఖాన చిరునవ్వు నవ్వుతూ
కడుపులో బాధ బాకై కూర్చున్నా...

ధైర్యము చొక్కా వేసుకున్న
చిల్లులు మాత్రం ఎక్కరిస్తున్నాయి
నావకు పడ్డా చిల్లుల
కష్టసుఖాలు వస్తూ పోతూ ఉన్నాయి..

ఆటుపోట్లు ఎన్నయినా ముందుకు సాగాల్సిందే
నడి సంద్రములో దిగ లేము
జీవిత నౌక ను ఆపలేము
గమ్యం చేరే వరకు ప్రాణం ముగిసే వరకు..

--కొప్పుల ప్రసాద్,
తెలుగు ఉపన్యాసకులు,
నలంద కళాశాలలు,
నంద్యాల.

4/Post a Comment/Comments