తిరిగి వచ్చిన అదృష్టం

తిరిగి వచ్చిన అదృష్టం

తిరిగి వచ్చిన అదృష్టం !(కథ)
######₹₹₹₹₹#######

కాంభోజరాజ్యన్ని ధర్మపాలుడు అను రాజు పరిపాలించేవాడు.
అతని పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉండేవారు. అతని పాలనలోన వర్షాలకు, పంటలకు కొదవలేదు. ఇలా ఉండగా ఒక రోజు రాజుగారి ఆస్థానానికి ప్రజలందరూ మూకుమ్మడిగా విచ్చేసి రాజుతో "మహారాజా!
మీ పాలనలో ఏ లోటు లేకుండా
మేము జీవిస్తున్నాం. పంటలు పుష్కలంగా పండాయి. కానీ అడవిలోని క్రూర మృగాలన్ని మూకుమ్మడిగా పంటలను పాడుచేస్తూ, పారదోల బోగా జనం పైన దాడి చేస్తున్నాయి. మీరే ఎలాగైనా ఆ క్రూర మృగాల నుండి మమ్మల్ని కాపాడాలి అని విన్నవించుకున్నారు."వారి విన్నపాన్ని మన్నించి రాజు తక్షణమే అడవిలోని మృగాలను వేటాడేందుకు తన సైన్యంతో బయలుదేరాడు.
          సైన్యం చేసే భేరి ధ్వనికి మృగాలన్నీ భయపడి అటు ఇటు అడవిలో పరుగులు పెడుతుంటే, ఆ అడవికి రాజు అయిన సింహము గమనించి
"ఓ మానవా! నీవు నీ రాజ్యానికి రాజువైతే, నేను ఈ అడవికి రాజును. నీవెలా నీ ప్రజలను రక్షించుకొనుటకు ప్రయత్నిస్తున్నావో, నేను అలానే నా మృగాలను రక్షించుకోవలసిన బాధ్యత నాపై ఉంది. కాన నీ వేట మానేసి వెళ్ళిపో"అని మానవ భాషలో మాట్లాడిందా సింహం. అయినా రాజు వేటను మానుకోక ఆ సింహంపైకి తన విల్లు ఎక్కుపెట్టి
వదలగా ఆ బాణం నేరుగా ఆకాశం పైన ఎగురుతున్న గరుడ పక్షిని ఢీకొట్టింది. ఆ గరుడ పక్షి నేలపై పడి విలవిలలాడుతుండగా, మరో గరుడ పక్షి వచ్చి చూసి "ఓరి దుర్మార్గుడా! నా భర్తను అన్యాయంగా చంపి వేశావు. నన్ను నా పిల్లలను దిక్కులేని పక్షులను చేశావు. నీవు కూడా నీ అర్ధాంగికి నీ పిల్లలకు దూరమై, నీ రాజ్యాన్ని పోగొట్టుకొని చెరసాల పాలవుదువుగాక "అని శపించి మాయమైపోయింది ఆ గరుడ పక్షి. రాజు వెంటనే చింతాక్రాంతుడై తిరిగి సైన్యంతో రాజ్యానికి చేరుకోబోగా, పొరుగు రాజైన విక్రమ సేనుడు తన సైన్యంతో ధర్మపాలుడిని, అతని సైన్యాన్ని ఎదుర్కొని వాళ్లందరిని బంధించి చెరసాలలో వేశాడు. తన భార్య పిల్లలతో చెరసాలలో పడిన రాజు ధర్మపాలుడు తన శాప విమోచన మార్గాన్ని వెతుకుటకై
ఆ చెరసాలలోని శివుని గూర్చి ఘోరతపమాచరించాడు. ఆ తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై"ఓ రాజా! నీ దీర్ఘ తపస్సుకు మెచ్చాను. ఏం కావాలో కోరుకో అనగా "ఈశ్వరా! సర్వేశ్వరా ! గరుడ పక్షి పెట్టిన శాపం వల్ల నేను, నా భార్య పిల్లలం దిక్కులేని వారము అయినాము. శాప విమోచనం మార్గాన్ని అడుగుదామన్నంతలో ఆ గరుడ పక్షి మాయమైపోయింది. కావున శాప విమోచనం తెలిపి మమ్ముల రక్షించు ఓ శంకరా మా అభయంకరా! నివేదిక్కు శరణం శరణం పాహిమాం పాహిమాం! అని శివున్ని ప్రార్థించాడు.
          శివుడు రాజు విన్నపాన్ని విని"ఓ రాజా! నీ బాధ నాకు అర్థమైంది. కానీ ఆ గరుడ పక్షి గరుత్మంతుని వాహనం. ఆ గరుత్మంతుని కాదని నేను నిన్ను కాపాడలేను. నీకు శాప విమోచన మార్గం సూచిస్తా. తక్షణమే నీవు గరుత్మంతుని గూర్చి తపమాచరించు. అతడు నిన్ను కరుణించి నీ శాప విమోచన మార్గాన్ని ఉపదేశిస్తాడు" అని శివుడు పలికెను.
శివుని ఆజ్ఞ ప్రకారంగా వెంటనే రాజు గరుత్మంతుని గూర్చి ఒంటి కాలుపై  తాపమాచరించెను. ఆ తపస్సుకు మెచ్చి గరుడు ప్రత్యక్షమై"ఓ రాజా! శివ పరమాత్ముని ఆజ్ఞానుసారం నీవు చేసిన తపస్సుకు మెచ్చాను. నీ శాపం తొలగిపోయి, నీవు నీ రాజ్యాన్ని తిరిగి పొందగలవు. చింతించవలదు"అని ఆశీర్వదించాడు.
          చెరసాలలో ఉన్న ధర్మ పాలుని, అతని భార్య పిల్లల వద్దకు విక్రమ సేన మహారాజు స్వయంగా వచ్చి"ఓ ధర్మ పాల మహారాజా! నిన్ను నీ భార్యా పిల్లలను మరియు నీ సైన్యాన్ని నేను ఆ ధర్మంగా బంధించి చెరసాలలో వేసి మహా అప్పిదము చేశాను. ఆ తప్పిద ప్రభావం చే నా భార్యా పిల్లలు కూడా నాకు దూరమై నేను అనాధగా మిగిలాను. నా భార్య పిల్లలను దూరం చేసుకుని అనాధగా బ్రతికే ఈ బ్రతుకు ఒక బ్రతికేనా? నాకు ఈ బ్రతుకు వద్దు. ఈ రాజ్యమూ వద్దు. నీ రాజ్యం తీసుకుని, ఈ అనాధ బ్రతుకు నుండి నన్ను కాపాడు"
అంటూ వలవల ఏడ్చేశాడు.
           విక్రమసేనా! పశ్చాత్తాపం కన్నా ప్రాయశ్చిత్తం లేదు. నీ పశ్చాత్తాపమే నీకు జ్ఞానోదయం కలిగించింది. నా రాజ్యాన్ని నాకు అప్పగించి నీ మంచి మనసును చాటుకున్నావు. జరిగిందంతా మన మంచి కోసమే. శాంతించు. పరి పరి విధాల దక్కించడం మంచిది కాదు. ఉభయులం కలిసిమెలిసి ఉందాం. రాజ్యాన్ని సమానంగా పంచుకుందాం. ప్రజలను మన కన్న బిడ్డల వల్లే చూసుకుందాం.
ఇద్దరం కలిసి పరిపాలన సాగిద్దాం. చరిత్రలో మంచి పాలకులుగా మిగిలిపోదాం.
శుభం శుభం శుభం. ఇదంతా ఆ పరమేశ్వరుడు మనకిచ్చిన వైభవం"అని పలికాడు ధర్మపాలుడు.

గుర్రాల లక్ష్మారెడ్డి. సహస్రకవి. రచయిత, కల్వకుర్తి నాగర్ కర్నూల్ జిల్లా తెలంగాణ
సెల్...9491387977.
Uploaded Image

0/Post a Comment/Comments