రామనామం.. మోక్షప్రదాయకం
రామనామం.. మోక్షప్రదాయకం
రామ నామం ఎంతో తీపి ,తారక మంత్రం
కష్టాల కడలిని దాటించు రామ నామం
శ్రీరామనము జయ జయ ద్వానం
సత్య పలుకు తార్కాణం రామనామం
శ్రీ సీతారామ కళ్యాణం జగత్ కళ్యాణం సకల శుభదాయకం .
మానవాళికి ఆదర్శం సీతారామ దాంపత్య జీవనం
రామావాతారం.. సకల మానవులకు ఆదర్శదాయకం
మానవ జన్మతో మోక్షప్రదాయుడు శ్రీ రాముడు.
రావణుడు గుహుడు ,అహల్య, శబరి, వాలి జటాయువు ల జన్మకు మోక్షం .
చిరంజీవి ఆయెను మన హనుమన్న.
దాశరధి మాటను దాటని కోసల తనయుడు
రాజ్య ప్రేమను కోరని సేవకుడు లక్ష్మణుడు
భరతునికి సోదర ప్రేమను పంచెను
వనవాసం విముక్తితో శ్రీరామరాజ్యం స్థాపన
నేటి నమోడి అయోధ్య బలరామ మందిరం తో
కల సాకారమయేను ఈ తరం జనుల ధన్యమాయెను
రచన ఇమ్మడి రాంబాబు తొర్రూరు జిల్లా మహబూబాబాద్ తెలంగాణ సామాజిక రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు