నెడుహనుమాన్ జయంతి

నెడుహనుమాన్ జయంతి

శ్రీ హనుమాన్ జయంతి విశిష్టతనుతెలుసుకుందాం!
హనుమజ్జయంతి ఏడాది లోమూడుసార్లువస్తుంది. ఎలాఅంటే,ఒక్కోప్రాంతవా సులు ఒక్కోసారి జరు పుకుంటారు. కొందరు చై త్ర పౌర్ణమినాడుహనుమా న్ జయంతిచేయగా,మరి కొందరు వైశాఖమాసం ద శమినాడు హనుమ జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మా సంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.పరాశర సంహిత అనే గ్రంథం ప్రకా రం ఆంజనేయుడు వైశా ఖ బహుళ దశమి, శనివా రంజన్మించారనితెలిపా రు అదే రోజున హను మంతుని జన్మ తిథి చేసు కోవాలని చెబుతారు.అ యితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నా డు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడువిజయం సాధించినట్లుకనిపిస్తుందిఈ కారణంగా ఆ రోజు హనుమద్‌విజయోత్సవం చేసుకునే సంప్ర దా యం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హను మంతుని జన్మ తిథిగా చేసుకుంటారనిపండితులు సూచిస్తున్నారు.చైత్ర పూర్ణిమ నాడు హను మంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపు కుంటారు..ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యా త్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తా రు, ఈ దీక్ష చివరి రోజున  హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికిఉత్సవాలను జరుపుతారు. వైశా ఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసివైభ వంగాపూజలునిర్వహిస్తారు. వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించ గలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్ర శక్తులనుతరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మిన బంటు అయిన హను మంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతునిఆరాధించ డంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి.చింత లు, చిరాకులుతీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజ యం చేకూరి,కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హను మంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటా రు. ఇకహనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతోహనుమంతుని అర్చిస్తారు.కలౌ కపి వినాయకౌఅంటే కలియు గంలో త్వరగా ప్రత్యక్షమ య్యే దేవతా రూపాలు.. వినాయకుడు,హనుమంతుడు.హిందూమతంలో ప్రాముఖ్యత:హనుమానంజనానూనువాయుపుత్రోమహాబలః రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమితవిక్రమఃఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశ గ్రీవస్యదర్పహాద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనఃస్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతఃతస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజ యీభవేత్హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరసపుత్రుడు.మహాబలు డు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱ ని కన్నులుగల వానరు డు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్నిదాటినవాడు. లంకలో బందీయైన సీత మ్మతల్లి శోకాన్ని హరించి నవాడు, ఔషధీ సమే తం గా ద్రోణాచలంమోసుకుని వచ్చిన యుద్ధంలో వివ శుడైన లక్ష్మణుని ప్రాణా లు నిలిపినవాడు. దశకంఠుడైనరావణాసురునిగర్వంఅణచినవాడుహనుమంతుని ఈనామా లు నిద్రించడానికి ముం దు, ప్రయాణానికి ముం దు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుందిహనుమంతుని నైజం:యత్ర యత్ర రఘు నాధ కీర్తనం తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారిపరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకమ్ శ్రీరాముని కీర్తన జరిగే చోట హను మంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటా డు. రాక్షసాంతకుడైన అటువంటిహనుమంతునికి నమస్కరిస్తున్నాను.
కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమం తుడు. ఏకాదశ11 రుద్రు లలోఒకరుశ్రీఆంజనేయస్వామి. పరమశివుని అంశతో జన్మించారు. సప్త చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాస మా నస సరోవరం సమీ పంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు.హనుమతుడికి 5సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమ ర్పించండి. 5 సార్లు హను మాన్ చాలీసాపారాయణ చేయండి. చైత్ర పౌర్ణిమ నుండి వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల మండలంపాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41 మీకు వీలైనన్నిసార్లుహనుమాన్ చాలీసా  పారాయణం చే యండి. ఇలా చేయడం చాలా శుభకరం, అను కున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కోరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అను గ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరూ,ఈ40మండలంరోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజూ స్వామికి పండ్లు తప్పనిసరిగా నివేదన చేసి, నైవేద్యంగా స్వీక రించడం వలన చక్కటి సంతానం హనుమ అ ను గ్రహంతో కలిగి తీరుతుం ది.
ఉమాశేషారావు వైద్య
ఎం.ఏ. బి.ఇ డి.ఎల్.ఎల్.బి
పాస్ ఇన్ ఏ ఐ.బి.ఇ
Uploaded Image Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments