నేడే తొలి ఏకాదశి, దనివిశిష్టత

నేడే తొలి ఏకాదశి, దనివిశిష్టత

నేడే తొలి ఏకాదశి పండుగశయన ఏకాదశి,తెలంగాణ లో యకసి అంటారు. హిందూ సం ప్రదాయంలో అత్యంత ప్రాము ఖ్యత ఉన్న తొలి ఏకాదశి పం డుగలకు ఆది. ఆషాడ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాద‌శిఅంటా రు. సంవత్సరం మొత్తం మీద వచ్చే 24 ఏకాదశు లు ప్రతీ నెల కృష్ణ పక్షంలో ఒకటి, శుక్ల పక్షంలో ఒకటి మొత్తంగా రెం డు ఏకా దశులు వస్తాయి. ఏ దో ఒక ప్రత్యేకతను సంత రిం చుకుంటాయి. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. మనకు ఉన్న టువంటి ఐదు జ్ఞానేంద్రి యాలు, ఐదు కర్మేంద్రియాలు వీటిని పనిచేయించే అంతరేం ద్రియం అయిన మనసు కలిపి తే పదకొండు. ఈ పదకొండు ఏకోన్ముఖంగా పనిచేసే సమ యమే ఏకాదశి.తొలి ఏకాదశి విశిష్టత ఆషాఢ మాస ఏకాదశి తొలి ఏకాదశిగా ఆషాఢశుద్ధఏకాదశిగాజరుపుకుంటారు. దీనినేశయనఏకాదశి,ప్రధమఏకాదశి,హరి వాసరంఅని కూ డా అంటారు. ఈ రోజు నుంచీ శ్రీమహావిష్ణువు క్షీరాబ్ధి యందు శేషపాన్పు పైన శయనిస్తాడు. కనుక దీన్ని శయన ఏకాదశి అంటారు. నిజానికి ఒకరకంగా పరిశీలిస్తే, ఇది ప్రకృతిలో జరిగే మార్పులకు పంచ భూతాలు, సూర్య చంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి సం కేతంగా చెప్పుకోవచ్చు. ఉత్తర దిశగా ఉన్న సూర్యుడు ఈరోజు నుం డి దక్షిణ దిశకు వాలుతున్నట్టు కనిపిస్తా డు.సూర్యుడు దక్షిణం వైపుకు మర లినట్లు, ఈ రోజు నుంచి దక్షిణాయ నప్రారంభాన్ని సూచిస్తుంది.అంతేగాక చాతు ర్మాస్య వ్రతం కూడా ప్రారంభ మౌతుంది. ఇదే రోజున గోపద్మ వ్రతమును ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఈ రోజు మొద లుకొ ని, కా ర్తీక మాస శుక్ల పక్ష ద్వా దశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వా దశి వరకు ఆచరించవలెనని పురాణా లుచెబుతున్నాయి.తొలి ఏకా దశి జరుపుకొను విధానం  నియమాలు మహిమాన్వి తమైన ఈ ఏకాదశి పర్వ ది నా న వ్రతాన్ని ఆచరిస్తే సూర్యచం ద్రగ్రహ ణములలోభూమిదానా లిచ్చి నంత, అశ్వమేధ యాగం చేసినంత, అరవై వేలసంవత్స రాలు తపస్సు చేసినంత పు ణ్యం లభిస్తుందని ఏకాదశి వ్ర త మహత్యాన్ని గురించి మన పురాణాలు చెబుతున్నాయి. మహాసాధ్వీ సతీ సక్కుభాయి ఈ వ్రతాన్నే ఆచరించి మోక్ష సిద్ధి పొందటం జరిగింది.వ్రతంలోనిప్రధాననియమాలుఉపవాస ఫలితాలు ఈ వ్రతాన్ని ఆచ రించ దలచినవారు దశ  మి నాడు రాత్రి నిరా హారులై ఉండి ఏకాదశి నాడు సూర్యో దయానికి ముందుగా కాలకృ త్యాలు తీర్చుకుని శ్రీహరినిపూజించాలి. ఆరోజుమొత్తంఉపవాసంఉండాలి.అసత్యమాడరాదు. స్త్రీ సాంగత్యం పనికి రాదు. కాని పనులు, దుష్ట ఆలోచనలు చేయకూ డదు. ఆ రోజు రాత్రంతా జా గరణ చేయాలి. మర్నాడు అనగా ద్వాదశి నాడు ఉద యాన్నే కాలకృ త్యాదుల అనంతరం శ్రీహరిని పూజించి నైవేద్యతాంబూలాలుసమర్పించి భో జనం చేయాలి. అన్నదా నం చేయడం చాలామంచిదిఏకాదశివ్రతమాచరించేవారు ఇవి తినరాదు. ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోద యానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, శ్రీహరి నిష్ఠ నియమాలతో పూజించాలి. పూజ గదిని శుభ్రం చేసుకుని విష్ణు మూర్తి ప్రతిమకు లేదా పటానికి పసుపు, కుంకుమలు పెట్టి పుష్పాలతో అలంకరించు కోవాలి. తర్వాత చక్కెర పొంగ లిని నైవేద్యంగా పెట్టి కర్పూర హారతివ్వాలి.ఏకాదశి వ్రతమా చరించే వారు కాల్చి వండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడి కాయ, చింతపం డు, ఉసిరి, ఉలవలు,  మినుము లు తీసుకోకూడదు. అదేవిధం గా మంచం పై శయనించడం చేయకూడదని పు రాణాలు చెబుతున్నాయి. ఈ ఏకాదశి విశిష్టతను గురించి పద్మ పురా ణంలో వివరించారు. అష్టక ష్టా లతో తల మునుకలౌతున్న మానవజాతిని ఉద్ధరించ టాని కి సాక్షాత్ శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేసాడనీ, ఈ వ్రతా న్ని నియమనిష్టలతో ఆచరిం చిన వారు సమస్త వ్యధల నుం చీ విముక్తి పొంద గలరనీ, మర ణానంతరం వైకుంఠ ప్రాప్తి లభి స్తుం దనీ పద్మ పురాణంలో పే ర్కొ న్నారనిచెప్తుంటారు.ఈరోజు నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు చాతు ర్మా స్య వ్రతంఅ వలంబిస్తారు. శాకాహారులై ఉపవాసవ్రతంఆచరించాలన్నది, ఈ చాతు ర్మాస్యవ్రత నియమం. ఏకాద శినాడు ఉపసించి, మర్నాడు పారణ చేసి, ప్రసాదం తీసుకొని వ్రతం ముగిస్తా రు. ఇది ముఖ్యంగా రైతుల పం డుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఏ రకమైన తెగుళ్ళు సోకకూడదని, ఇతరత్రా ఏ సమస్యలూ ఎదురవకూడదని దణ్ణం పెట్టుకుంటారు. తొలి ఏకాదశి పండుగ నాడు మొక్క జొన్న పేలాలను మెత్తటి పొడి గా దంచి, అందులో నూరిన బెల్లం కలిపి దేవుడికి నైవే ద్యం గా సమర్పిం చి,ప్రసాదంగాతీసుకుంటారు.తొలిఏకాదశినాడుఈపేలపిండినితప్పకుండా తినాలని విశ్వసిస్తారుతొలి ఏకాదశి రోజున శేషసాయిని పూజిస్తేప్ర‌తి నెలా వచ్చే ఏకా దశి రోజున శ్రీహరిని పూజిస్తే అష్టైశ్వర్యాలుచేకూరుతాయని పండి తులు అంటున్నారు. ఈ మాసంలోనే బోనాలు, పశుపూ జ,శకట ఆరాధనలు చేస్తారు. ప్రాశస్త్యం ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చే తొలి ఏకాదశి రోజున ఒంటిపూటభోంచేసి,శేషశాయిఅయినలక్ష్మీనారాయణ మూర్తిని స్తుతిస్తే కోటి పుణ్యాల ఫలం లభిస్తుందని విశ్వాసం. ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణు మూర్తి పాలకడలిపై యోగ నిద్రలోకి వెళ్ళే సందర్బాన్ని తొలి ఏకా దశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి’ అని కూడా అంటారు. సతీ సక్కు బాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వా దశినా టిఉదయంవిష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షా ళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉప క్రమించే విష్ణువు మళ్ళీ నా లుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొం టాడం టారు. దానిని ‘ఉత్థాన ఏకాదశి’ అంటా రు. ఆ తర్వా త రోజు వచ్చే ద్వాదశినే ‘క్షీరా బ్ధి ద్వాదశి అంటారు. ఈనాలు గు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూచాతుర్మా స్యదీక్ష చేస్తారు.
వైద్య.ఉమాశేషారావు
లెక్చరర్
కామారెడ్డి
9440408080
Uploaded Image Uploaded Image Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments