చిరునవ్వే ...జీవితం
---- ప్రత్తి శ్యామల
గడిచిన కాలం చాలా బాగుంటుంది ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు కాబట్టి...
అనంతమైన దు:ఖాన్ని
ఒక్క చిన్న చిరు నవ్వు చెరిపివేస్తుంది.
భయంకరమైన మౌనాన్ని
ఒక్కమాట తుడిచి వేస్తుంది.
అందుకే ఎన్ని కష్టాలు వచ్చినా చిన్న చిరునవ్వుతో దూరం చేసుకుందాం
కష్టాల్లో ఉన్నవారిని ఒక్క పలక రింపుతో సంతోష పెడుదాం
పదిమందిలో ఉన్నప్పుడు
పట్టింపులు మరిచిపోవాలి
నలుగురిలో ఉన్నప్పుడు
నవ్వటం నేర్చుకోవాలి
అయినవాళ్ళందరితో ఆనందాన్ని పంచుకోవాలి
కష్టాల్లో ఉన్నప్పుడు
కన్నీళ్ళు ఓర్చుకోవాలి
చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకోవాలి
గతం చేసిన గాయాలు మర్చిపోవాలి
ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి
మనిషి జీవితం అంటేనే
ఒక యుద్ధం అని తెలుసుకోవాలి..
అందుకే చిరు నవ్వే
జీవితం అని తెలుసు కోవాలి
