మేధస్సు కు సైల్యూట్
మార్పుకు మానవుడు
కూర్పుకు మానవుడు
చేర్పుకు మానవుడు
చెదన చేసి సాధన చేసి
అవిష్కర్త మానవుడు
అగ్గి పెట్టెలు పెట్టి
దారం కట్టి మాట్లాడుకున్న
బాల్యం లోనే దాగి ఉంది
విజ్ఞాన సర్వ్సవం
పుట్టుకచ్చిన గ్రాహం బెల్
ఫోన్ తెచ్చే
ప్రింటర్ వచ్చే
కంప్యూటర్ పుట్టుకొచ్చే
సమాచారం మార్పు అంకురార్పణ జరిగే
అభివృద్ధిలో సోపానం అయ్యి
ఫుడ్ ఆర్డర్ నుంచి బెడ్ డెకరేషన్ వరకు
నెట్ నెట్ అది లేకుంటే
కట్ కట్
మనుసు ఆందోళన
మారుమూల గ్రామంలో
సైతం నెట్
నట్టింట్లో నెట్ హల్చల్
ఫోన్ లో ట్యాప్ లో
నేటి తరం నెట్ తోనే
వారి భవిత
మార్పు మంచికే
పెరిగిన సాంకేతికత
సైబర్ నేరాలకు తోడ్పాటు
ఇవ్వవద్దు
సాకారాత్మక దృక్పథానికి
వాడుదాం
అభివృద్ధికి సోపానంగా
మెదస్సును ఉద్భవించిన
నెట్ ను ప్రగతి కారకం గా
బాధ్యతగా మార్చుకుందాం
ఉమశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్
లింగాపూర్, కా మారెడ్డి
