సంపూర్ణ ఆరోగ్యమే యోగా (పసుమర్తి నాగేశ్వరరావు)

సంపూర్ణ ఆరోగ్యమే యోగా (పసుమర్తి నాగేశ్వరరావు)




సంపూర్ణ ఆరోగ్యమే యోగా

ఆరోగ్యమే మహాభాగ్యం
యోగాతోనే సాధ్యం ఆరోగ్యం
ఆరోగ్య యోగమే అదృష్ట భాగ్యం
సంపూర్ణ ఆరోగ్యమే నేటి సౌభాగ్యం

యోగా మనసికఒత్తిడి ని తగ్గిస్తుంది
క్రమశిక్షణ జీవితాన్ని ప్రసాదిస్తుంది
ఏకాగ్రతను మనఃశ్శాంతి ని కలుగజేస్తుంది
ధ్యానం ద్వారా సత్పలితాలను అందిస్తుంది

యోగా ఇది ప్రకృతి వైద్యం
సాటి రాదు దీనికి ఏ వైద్యం
ఆరోగ్యానికి వైవిధ్యమైన వైద్యం
పురాతనం నుండి మన ఆరధ్యం

ప్రకృతి ద్వారా సౌలభ్యమైన వైద్యం
కాసులతో విలువ కట్టలేని వైద్యం
పతంజలి ప్రవేశపెట్టిన ప్రకృతివైద్యం
సంపూర్ణ ఆరోగ్యం యోగాతో సాధ్యం

భక్తి రాజకర్మ యోగములు
శారీరక మానసిక ఆలోచనల
సంప్రదాయ ఆహార నియమాలు
ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఆనంద ప్రక్రియలు
ఇవే యోగ రాజమార్గాలు

శ్వాసయందు ధ్యాస 
ప్రాణవాయువు లభ్యత
అంగాంగము శుభ్రత
ఇదే యోగా యోగ్యత


రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          సాలూరు
           విజయనగరం జిల్లా
           


0/Post a Comment/Comments