ఆధునిక చాణక్యుడు -పి.వి
————————————
1.తే.గీ.
దార్శనిక రాజకీయమేధావి,ప్రజలు
నేటి కాలపు చాణక్యునిగ కొలువఁగ,
రాజకీయపనిశ్చితిన్ రాజ్యమేలె,
బహుముఖంబైన ప్రజ్ఞకు బాహ్య రూపి
2.తే.గీ.
భాధ్యతాయుత యార్ధిక పలురకాల
సంస్కరణలంద జేసిన సాహసికుడు,
పేదలకు మేలు తలపెట్టె వీరి ఠీవి
వంగరకు దత్తుడు, ప్రజల వరుడుపీ.వి
3.తే.గీ.
ఇరువై వర్షముల క్రింద యింపుగ తను
తెల్పినట్టి సిద్ధాంతపు తెమ్మెరలను
నేటి కియు నాదరించెను నిజము గాను,
పదవికై తీయలేదుగా పరుగు నెపుడు!
4.తే.గీ.
కేంద్ర సాహిత్య బహుమతి కృషిని నిలిపి,
సాయుధపు తెలంగాణరచనలు జేసె
పదియు నాలుగు భాషలన్ వదలకుండ,
నేర్చి నట్టి భాష పిపాసి, నిపుణుడితడు!
5.తే.గీ.
రాజగు నిజామునెదిరించి, ప్రజల కొరకు,
తెలుగు మాగాణి కై పోరు దిక్కులందు,
నడుమునకు కండువను గట్టి నడిచినట్టి,
పంచె కట్టు తెలుగుకొక బహుమతితడు!
—డా. కాట్నపల్లి ప్రియదర్శిని,
హైద్రాబాద్.