నువ్వులేక నేనులేను
కలం పట్టి కవితలు రాస్తుంటే
కలం కథలను అంది
నిరంతరం నన్ను పట్టి నన్ను తట్టి
ఎందరివో ఎన్నెన్నో కవితలు
కథలు రాస్తున్నావ్
మరినా
కోసంరాయవాఅనిప్రశ్నిచింది
నువ్వే నా బలం నువ్వు లేక నేనులేను అన్నాను
నిజమే కదా ఇన్ని రాస్తున్న
ఇందరిపై రాస్తున్నా మన మెదడులో ఉన్న ఆలోచనలకు
రూపాన్నిచ్చి గౌరవాన్ని తెచ్చేది
కలమే
ఎన్నో ఏళ్లుగా ఎంతో మందిని
కవులుగా కవయిత్రులుగా మలచి
సాహితీ లోకం లో ఎందరికో పేరు తెప్పించి ఉన్నత శిఖరాలను అందించావు.
నన్ను కూడా అనుగ్రహించి
నాపై కరుణ చూపు
నా బలం కలం అని నిరూపించు
మహాప్రస్థానం ద్వారా ఒక శ్రీ శ్రీ ని
కన్యాశుల్కం ద్వారా గురజాడ ని
గబ్బిలం ద్వారా ఒక ఫిరదౌసిని
ఇలా ఎందరినో అభ్యుదయ సాహితీ వేత్తలగా చేసావు
నిన్నే నమ్ముతున్న నన్ను కూడా
కరుణించు
నిన్ను నమ్మి నిన్ను నిరంతరం సాన పట్టిన వారిని అందళమెక్కించావ్
కథకైనా కవితకైనా కథానికనికైనా
నిన్ను కదపనిదే ఏ పని కాదు
గళం విప్పిన కలం పట్టకపోతే బలం రాదు.
అందుకే నన్ను అనుగ్రహించు
చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలువాలన్నా
చరిత్రను తిరిగి రాయాలన్న
చరిత్ర గతిని మార్చలన్నా
కలం కదపవలసిందే
అందుకే కలం నువ్వు నాకు బలం
నువ్వే నా బలం నా బలహీనత
నా ఆలోచనల రూపం నువ్వు
నా కవితా రూపానివి నువ్వు
నా ఆశల ప్రతిరూపానివి నువ్వు
నా కలల అక్షర రూపం నువ్వు
నా కలం బలం నువ్వే
రచన: పసుమర్తి నాగేశ్వరరావు,
సాలూరు,
విజయనగరం జిల్లా.
