శీర్షిక:దేవుడిచ్చిన అమ్మ
ఈ వారం నా కవిత సంఖ్య3
అమ్మ అపురూప బొమ్మ
దేవుడిచ్చిన ఒక గొప్ప బహుమతి
మనల్ని కంటికి రెప్పలా చూసేది
కడుపులో పెట్టుకుని కాచేది
గుండెలో నిండైన ప్రేమను ఉంచేది ప్రేమను పంచేది
గోరుముద్దలైన వెన్నెముద్దలైన
కొండపైన కోతినైన నింగిపైనా నెలవంకైనా
అందరానిదైన అంతుచిక్కనిదైన
అరచేతిలో అరనిమిషంలో అందించేది
భయాన్ని పారదోలేది
గుండెకు హత్తుకునేది
ప్రపంచాన్ని చేయి పట్టి మనసుపెట్టి పరిచయం చేసేది
తొలిగురువుగా అన్నీ తానై నేర్పేది
ఎవరు రాయగలరు అమ్మా అనే మాటకు అర్థం
ఎవరు చెప్పగలరు అమ్మా అనే మాటకు పరమార్ధం
అమ్మ ఎవరికైనా అమ్మ
విలువైనది విలువకట్టలేనిది అమ్మ
అందరి అమ్మ
రచన:పసుమర్తి నాగేశ్వరరావు
సాలూరు
విజయనగరం జిల్లా
ఇది నా స్వీయారచన. హామి ఇస్తున్నాను
