ఆహార ప్రదాత (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

ఆహార ప్రదాత (పసుమర్తి నాగేశ్వరరావు టీచర్ సాలూరు)

ఆహార ప్రదాత

అన్నదాత సర్వ మానవాళికి ఆహార ప్రదాత
కష్టించి చెమటోడ్చి కాయకష్టం చేసి
చిరునవ్వుతోనే సిరిపంటలను
సస్యశ్యామలం చేసి
ఎండనక వాననక పుడమి తల్లిని
నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసి
జీవితమంతా పుడమి తల్లికి దారవోసి 
కారువులు వచ్చిన వరదలు వచ్చిన
అతివృష్టి ని అనావృష్టిని
భరిస్తూ భాద్యత వహిస్తూ
నకిలీ విత్తనాల బాధను కూడా దిగమింగుతూ వరుణ దేవుని
కరుణా కటాక్ష వీక్షణాలతో
లాభాపేక్ష కాక పుడమి పై ప్రేమతో
నిత్యం అనునిత్యం తన రక్తాన్నే
స్వేదం చేసి తన కష్టానికి ప్రాణం పోసి అందరికి అన్ని వేళలా నెనున్నానని భరోసా ఇస్తూ 
జగతి లో జనావాళి కి అక్షయపాత్ర వలే లోటు లేకుండా కావలసినవి
అన్ని అందిస్తున్న జీవ ప్రదాత మన అన్నదాత.జై కిసాన్ జైహింద్

రచన:పసుమర్తి నాగేశ్వరరావు
          సాలూరు
           విజయనగరం జిల్లా


0/Post a Comment/Comments