ఆకాశం అమృత చినుకుల్ని
నేల జారనీయక అబల ఆర్తితో
బంధించెను పళ్ళెములో
అమృతధార అందరికీ జీవనధార...
సకల జీవులకు జలమే జీవనము
అది తెలిసిన బాలిక...
ఒడిసిపట్టి దాహార్తికి
జాగురూకతతో స్పందించింది
నారు పోసినవాడు నీరు పోయాలని బాలల జీవనానికి
బాధ్యుడు వి నీవే నని నిలదీసింది పంచభూతాలను
బంగారు బాల్యమే భవితకు పునాది
భవిత్ బాలల భవితకు రక్షకులం మనం....
రక్షించుకుందాం బాలల నీ అందమైన వాళ్ళ బాల్యాన్ని.
నేటి బాలలే రేపటి పౌరులు దేశానికి పౌరులే ప్రాణం....
ప్రకృతి వనరులను రక్షించి
పౌరులకు ఇద్దాం ఆదర్శ దేశ మై విలసిల్లుదాము...
పేరు శ్రీమతి సత్య మొం డ్రేటి
ఊరు హైదరాబాద్
