అమరవీరులు

అమరవీరులు

అమరవీరులు
నిన్న ఇందూర్ లో
ముష్కరుని చేతి లో
ప్రాణాలు వదిలిన
ప్రమోద్ కుటుంబానికి
ఏమి ఇవ్వగలవు
మానవ హక్కుల 
సంఘాలు అతని
సతి కి పతిని ఇవ్వగలవా
తల్లి కడుపు కోత తీర్చగలవా
ప్చ్ ప్చ్ లేదు సమాధానం
ఆపు ఆపు వారిపై దుష్ప్రచారం
మీ త్యాగాలు 
మీ త్యాగాలు నిరూపమానం
మూల్యం కట్టలేనివి
కర్షకుని చేత పంట
సైనికుని చేత దేశ రక్షణ
నీ చేత పౌర రక్షణ
బలవంతుడు నుండి
 బలహీనుడికి నీవే రక్ష
 ఆడదాని మానానికి
 రక్ష అయ్యి
 అక్క చేతి కి రాఖీ అయ్యి
 నేను సైతం ప్రపంచాగ్నికి సమీదను అయ్యి అన్న శ్రీ శ్రీ
వాఖ్యలు నీవు బహుచక్కని
 సామీప్యత నీది
 ట్రాఫిక్ బేఫికర్ చేసి
 నాయకులకు ఎస్కార్ట్ ఇచ్చి
 షీ టీం తొ 100 కు కాల్
 చేయగానే కాకి లాగా వాలుతావు
నైట్ పెట్రోలింగ్ పేరుతో
డేగా కళ్ళతో కాపు కాసి
దొంగతనాలు జరుగకుండా
కాపాడుతావు
కనిపించని నాలోగో సింహం
కష్టాలు ఎన్నో ఎన్నో
వ్యక్తి గత జీవితం దూరం
అయ్యి ప్రమాదాల్లో మరణించి
దాడుల్లో గాయపడి
ఆప్యాయతలు ఆటపాటలు
అనురాగలు ప్రజాలతోనే
ఒక్క క్షేణం నీవు లేదని
తెలిస్తే సంఘ విద్రోహ శక్తులు
పెట్రేగిపోతారు
సినిమా లు లేవు శీకార్లు లేవు
కుల మతాలు లేవు
సాంఘిక  సమానత్వాన్ని 
కోసం హక్కుల రక్షకుడు
అమ్మ జన్మణిస్తుంది
నాన్న పెంచుతాడు
నాకు మీరే రక్ష
వీధి నిర్వహణలో నిజాయితీకి
నిలువుటద్దం ల ప్రాణాలు
వదిలిన అమరపోలీస్ లకు
నా మనోనేత్రం నుండి
జాలువారుతున్న అశ్రునయనాల నుండి
అమర్ హై అమర్ హై
రక్ష మీరే సురక్ష మీరే
ప్రాణ భిక్ష మీరే
చిట్టి వ్యాపారుల నుండి
సైబర్ నేరాల వరకు
నేర రహిత సమాజమే నీ
లక్ష్యం... సమాజమే నీ దేవాలయం
దేవునికి ఇచ్చే అర్చన నీవే
అభిషేకం నివ్వె
పోలీస్ అనే పవర్
శక్తివంతం అయ్యి
మీకు మా సలామ్ 
మనిషికి గుండె
సమాజానికి పోలీస్
నా కవిత అక్షరాలతో
మీ సేవలకు నా ప్రాణమములు
శేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పాలిటిక్స్
కామారెడ్డి

0/Post a Comment/Comments