ఇంట్లో ఏర్పాటు చేసే వినా యకుడి ప్రతిమ ఎంత సైజులో ఉండాలి?
ఇంట్లో ఏర్పాటు చేసే వినా యకుడి ప్రతిమ ఎంత సైజులో ఉండాలి.ఆ విగ్రహాన్ని నిమజ్జ నం చేయకుండా అలానే ఉం చవచ్చునా? మామూలుగా పూజ చేసేటప్పుడు కూడా అరచేతి పరిమాణంలో ఉండా లా? లేక వ్రతకల్పం వరకేనా?
వరసిద్ధి వినాయక వ్రతానికి ప్రతిమ ప్రధానంగా మట్టితో చేసి ఉండాలి.కల్పాలలో మ ట్టితోగానీ, వెండితోగానీ, బం గారంతో గానీ అని వ్రాసి ఉన్న ది.ధాతువులతో చేసిన విగ్ర హాలకు నిమజ్జనం లేదు. మ ళ్ళీ వాటిని పూజకు వాడుకో వచ్చు. కానీ మట్టితో చేసిన ప్రతిమను పూజ అయిన తర్వాత నిమజ్జనం చేసి తీరాలి అని శాస్త్రం చెప్తున్నది.
ఈ భాద్రపద శుద్ధ చవితికి చేసే ప్రతిమ మాత్రం మట్టితోనే చే యాలి.అందుకే కృత్వా మహీమయీం మూర్తిం' అని శాస్త్రంలో చెప్పారు. దీనినే పార్థివ మూర్తి అంటారు.శివు ని అర్చనలో కూడా పార్థివ లింగార్చనచేస్తారు.ఆలింగాలను పూజానంతరం నిమజ్జనం చేస్తాం.అదేవిధంగా గణపతిని కూడా పార్థివ మూర్తిని చేయా లి. ఆ మట్టికూడా నీటిలో కర గగలిగే లక్షణం కలిగి ఉండాలి.
పార్థివ గణపతిని పూజించి మ ళ్ళీ దానిని జలతత్వంలో నిమ జ్జనంచేయాలి.ఇదియోగపరంగా స్థూల తత్త్వాన్ని సూక్ష్మ త త్త్వంలో లీనం చేస్తూ వెళ్తేనే పరతత్త్వం లభిస్తుంది అంటా రు.అందుకే స్థూలమైన పార్థి వతత్త్వాన్ని దానికంటే సూ క్ష్మమైన జలతత్త్వంలో విలీనం చేయాలి. అది నిమజ్జనంలో ఉన్న పరమార్థం.కనుక ఈ వ్ర తాన్ని మాత్రం మట్టి గణపతినే పూజించాలి. ఇంట్లో పూజించే విగ్రహం ఎప్పుడూ పెద్దదిగా ఉండరాదు. విగ్రహం పెరు గు తున్నకొద్దీశాంతిపెరుగుతుంది. గృహ పరిమితులను అను సరించి విగ్రహాలు ఉండాలి.
గృహంలో పూజించే విగ్రహం ఎప్పుడూ వితస్తి ప్రమాణంలో ఉండాలని శాస్త్రం చెప్తున్నది. వితస్తి అంటే అరచేయి అంత పొడవు. ధాతువులకు అయి తే మరీ నియమం వితస్తి దా టరాదు.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి