అలుమగలు కవిత

అలుమగలు కవిత

 భార్య భారం కానిది
భర్త భరించే వాడు
భర్త తమలపాకు అయితే
భార్య సున్నం తో ఎర్రగా పండే తాంబూలం
భర్త గోరింటాకు అయితే
భార్య ఎర్రగా పాండే రంగు
భర్త పాలు అయితే
భార్య కుదురు కున్న పెరుగు
భర్త సంసారానికి కర్త
భార్య జీవన మజిలీ క్రియ
భార్య ఏడూ అడుగులు తో ఏకమైతే
భర్త ఏడూ జన్మలకు సరిపడా
సాంగత్యం ఇచ్చేవాడు
భర్త అద్దం అయితే భార్య ప్రతిబింబం వంటిది
   భార్య గా ఒక దేహం
   భర్త గా ఒక దేహం
   బౌతికంగా వేరు
   ఏకమై అర్థనారీశ్వరులు
    భార్య శిశువు మొస్తే
     శిశువు ధాతువు భర్త
     ఇరువురి తన్మయమే
   ..  సంతానం
     ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ కాదు
ముచ్చటగా మూడు ముళ్ళతో
ఏకమై జీవన మాధారనుభూతుల సంపుటే
భార్య భర్తలు
   ఉమశేషారావు వైద్య
కామారెడ్డి 9440408080
Uploaded Image

0/Post a Comment/Comments