ఇంద్రియ జ్వలనం
--- డా.రామక కృష్ణమూర్తి,
బోయినపల్లి, సికింద్రాబాద్.
అహంకారం, అజ్ఞానం కలగలిసి
పేట్రేగిపోయే అధములు
విలువలు మరిచి, తామసంతో తపించి
కర్మవిహీనులై రగిలే దుస్సాహసులు
ఫలితం తెలియక పావులను చేసే
కలికాలాసురులు
చైతన్యం నశించి, మదం పెరిగి
ప్రవర్తించే గుణహీనులు
ఆశలతో, కల్మషమైన పథకాలతో
అమాయకులను వాడుకొనే నీచులు
దుష్టయజ్ఞాలు చేసి అవమానించాలనుకొనే
అతితెలివి అర్భకులు
అనురాగాలను, బంధాలను ఆవలనెట్టి
కఠిన, కుటిల, కుచ్ఛిత దనుజులు
నిర్వర్తించే దక్షయజ్ఞాలలో
అభిమానవంతులు, ప్రేమమూర్తులు కాలిపోకూడదు
జ్ఞాన త్రినేత్రాలను తెరిచి
విచక్షణలను పెంచుకొని
గుణపాఠాలు నేర్పాలి.