తెలంగాణ కొండ లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ కొండ లక్ష్మణ్ బాపూజీ

తెలంగాణ కొండ కొండ లక్ష్మణ్ బాపూజీ
తెలంగాణ చరిత్రలో స్వతంత్ర ఉద్యమంలోస్వాతం త్ర్రయోధుడిగా, గాంధే యవాదిగా, ప్రజా నాయకు డిగా, సామాజిక సంస్కర్తగా తనదైన ముద్ర వేసిన మహ నీయుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. పదవులు, అధికారాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, తెలంగా ణ ప్రజల ఆకాంక్షల కోసం జీవి తాంతం పోరాడిన త్యాగధను డు ఆయన. కొండా లక్ష్మణ్ బా పూజీ 1915 సెప్టెంబరు 27న అప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని వాంకిడి గ్రామంలో జన్మించా రు. చిన్నతనం నుంచే దేశభక్తి, సామాజిక చైతన్య భావాలు ఆయనలో పెరిగాయి. ఉర్దూ, మరాఠీ మాధ్యమాల్లో విద్యా భ్యాసం చేసిన ఆయన అనం తరం న్యాయశాస్త్రాన్నిఅభ్యసిం చి న్యాయవాదిగా ప్రజలకు సేవలందించారు. న్యాయవాద వృత్తిని కేవలం జీవనోపాధిగా కాకుండా ప్రజలకు న్యాయం అందించే సాధనంగా భావిం చారు.హైదరాబాద్ సంస్థా నం లో నిజాం పాలన కొనసా గు తున్న కాలంలో ప్రజలకు పౌర హక్కులు,ప్రజాస్వామికహక్కు లు కల్పించాలనే లక్ష్యంతో జరిగిన ఉద్యమాల్లో బాపూజీ చురుకుగా పాల్గొన్నారు.1938 లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం లో పాల్గొని అరెస్టయ్యారు. 19 42లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొని బ్రిటి ష్ పాలనకు వ్యతిరేకంగా తన గళాన్ని వినిపించారు. నిజాం పాలనకువ్యతిరేకంగాప్రజాస్వా మ్య హక్కుల కోసం పోరాడు తూ ఎన్నో ఇబ్బందులను ఎదు ర్కొన్నారు. ప్రజా ఉద్యమకా రుల తరఫున న్యాయవాదిగా నిలబడి వారికి అండగానిలిచా రు.స్వాతంత్ర్యం వచ్చిన తరు వాత కూడా ఆయన ప్రజాసే వను కొనసాగించారు. 1952 నుంచి 1978 వరకు శాసనసభ సభ్యుడిగా పనిచేశారు.డిప్యూ టీ స్పీకర్‌గా, మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. 1967లో భువనగిరి నియోజక వర్గం నుంచిఎన్నికైరాష్ట్రమంత్రి వర్గంలోసమాచార,పౌరసంబం ధాలు, కార్మిక శాఖలకు మంత్రి గా సేవలందించారు. పదవిలో ఉన్నప్పటికీ సామాన్య ప్రజల సమస్యలను విస్మరించకుండా వారి సంక్షేమం కోసం కృషి చేశారు.చేనేత కార్మికులు, పద్మశాలీలు, వెనుకబడిన వర్గాలు, అణగారిన ప్రజల అభ్యున్నతికి బాపూజీ విశేష కృషి చేశారు. చేనేత రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లా రు. కార్మికులు, పేదలు, బలహీ న వర్గాలకు సామాజిక న్యా యం అందాలని నిరంతరం పోరాడారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం, స్వాభిమానం పెంపొందాలని ఆకాంక్షించారు.కొండా లక్ష్మణ్ బాపూజీ జీవితంలో తెలంగా ణ ఉద్యమం ఒక ముఖ్యమైన అధ్యాయం. 1969లో ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన ఉద్య మానికి ఆయన బహిరంగంగా మద్దతు తెలిపారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ తన మంత్రి పదవిని సైతం త్యజించారు. అధికారాన్ని, పదవిని పట్టుకొని ఉండటం కంటే ప్రజల ఆకాంక్షలకు అండగా నిలబడటమే తన కర్తవ్యమని ఆయన తన ఆచరణతో నిరూపించారు. పదవిని త్యజించి తెలంగాణ ఉద్యమానికి అంకితమైన ఆయన త్యాగం తెలంగాణ చరిత్రలోచిరస్థాయిగానిలిచిపో యింది.తరువాతి కాలంలో కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన తనవయస్సునులెక్కచేయకుండా ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్షతో వివిధ దశల్లో జరిగిన ఉద్యమాలకు నైతిక బలాన్ని అందించారు. తన జీవితకాలంలో తెలంగా ణ రాష్ట్రం ఏర్పడకపోయినా, తెలంగాణ కోసం ఆయన చేసిన పోరాటం తదుపరి తరాలకు స్ఫూర్తిగా నిలిచింది.
బాపూజీ జీవితం పదవులు, అధికారాల చుట్టూ తిరగలేదు. ప్రజాసేవ, సామాజికన్యాయం, ప్రజాస్వామ్యం, తెలంగాణ ఆత్మగౌరవం అనే విలువల చుట్టూ ఆయన జీవితం సాగిం ది. ఎన్నో ఉన్నత పదవులు నిర్వహించినప్పటికీ నిరాడం బర జీవితం గడిపారు. వ్యక్తిగ త ప్రయోజనాల కంటే ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చారు. గాంధేయ సిద్ధాంతా లను విశ్వసించి, తన ఆచరణ లో వాటిని పాటించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ 2012 సెప్టెంబరు21నహైదరాబాద్‌లో 97 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని ఆయన ప్రత్యక్షంగాచూడలేకపోయినా, తెలంగాణ కోసం ఆయన చేసి న పోరాటం, త్యాగం, ప్రజాసేవ చరిత్రలోచిరస్థాయిగానిలిచిపో యాయి.కొండా లక్ష్మణ్ బాపూ జీ జీవితం ఒక వ్యక్తి జీవితం మాత్రమే కాదు; అది పోరా టానికి, త్యాగానికి, ప్రజాసే వకు, ఆత్మగౌరవానికి ప్రతీక. స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొని ప్రజాస్వామ్య హక్కుల కోసం పోరాడిన ఆయన, సా మాజిక న్యాయం కోసం కృషి చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం మంత్రి పదవిని సైతం త్యజించి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఆయన త్యాగాలు, సేవలు, ఆదర్శాలు నేటి తరానికిత్యజించినస్ఫూర్తిదాయకం. ప్రజల కోసం పదవు లను సైతం త్యజించిన మహ నీయుడిగా కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు తెలంగాణ చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోతుంది.
వైద్య.ఉమాశేషారావు
లెక్చరర్
లింగాపూర్
కామారెడ్డి
9440408080
Uploaded Image Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments