వినాయక చవితి ముందు రోజు గౌరీపూజ ఎందుకు చేస్తారు?
శక్తికి మూలం దేవత మరియు మంగళకరం, మంగళప్రదానికి సంకేతం గా గౌరీదేవిని పూజిస్తారు. గౌరీ పండుగను భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో జరుపుకుంటారు. గౌరీ గణేష్, గౌరీ చౌతి లేదా గౌరీ పండుగ అని పిలువబడే ఈ పండుగను గణేశ చతుర్థి సందర్భంగా జరుపుకుం టారు. గౌరీ పండుగ మరుసటి రోజు, భాద్రపద శుద్ద చతుర్థి రోజు నుండి గణేశ చతుర్థి పండుగ పర్వదినాలు ప్రారంభమవుతాయి. సౌభగ్యాలను ప్రసాధించే గౌరీ పండుగను వివాహిత మహిళలలకు జరుపుకుంటారు, గౌరీ దేవిని ఆరాధించడం వల్లసుఖ,సంతోషాలతో పాటు ఆనందం, సంపద మరియు సుదీర్ఘ జీవితాన్ని ఇస్తుందని తన భర్తను ఆయుష్యును దీవించి ఆశీర్వదిస్తుందని అంటారు. గౌరీ పండుగ వరమహాలక్ష్మి వ్రత మాదిరిగానే ఉంటుంది. తేడా ఏమిటంటే లక్ష్మి స్థానంలో గౌరీదేవిని పూజిస్తారు. గణేశ చతుర్థి సిరి సంపదలు సమృద్ధి గా, జ్ఞానం, గొప్పతనం, దీర్ఘాయువు, ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించే వారు గణేశుడు. పంచాగం ప్రకారం, పండుగ భాద్రపద మాసం లో వస్తుంది. ఈ సంత్సరం 13న సోమవారం నాడే తదియ మధ్యా హ్నం చవితి వచ్చి మంగళవారం ఉదయం వరకు ఉంటుంది. అన్ని వేలలా కరుణ కలిగి, ఎల్లప్పుడు ఆశీస్సులను ప్రసాధించే గణేష్ ను ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలు గణేశ చతుర్థిని జరుపుకుంటారు. ఈ పండుగను ఇంటి సాంప్రదాయాల ప్రకారం, ఒక రోజు, మూడు రోజులు, 5 ఏడు రోజులు, పది రోజులు జరుపుకుంటారు. కొంత మంది గౌరీ, గణేశుడి విగ్రహాన్ని గౌరీ ఇంటికి తీసుకువస్తారు. మరో ఇద్దరు గౌరీ విగ్రహాలను కూడా తెచ్చి గణేశుని సోదరీమణులుగా ఆరాధిస్తారు. గౌరీ చతుర్థి ఆచారం మహిళలు చతుర్థికి ముందు రోజు గౌరీ దేవిని పూజిం చడం ఆచారంగా వస్తోంది. అమ్మ విగ్రహాన్ని పసుపుతో అలంకరించి బియ్యం లేదా ధాన్యాల కలశం ఉంచడం జరుగుతుంది. పూలు, పండ్లు సమర్పించి పూజిస్తారు. మరుసటి రోజు గణేశుడిని ప్రతిష్ఠించి పూజలు చేస్తారు.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
లింగాపూర్
కామారెడ్డి
9440408080