అసలు జ్ఞానం అంటే ఏమిటి

అసలు జ్ఞానం అంటే ఏమిటి

ఒక సంతకంతో సర్వ ఆస్తి దానం చేయవచ్చు.ఒక అగ్గిపుల్ల సర్వం  దహనం చేయవచ్చు.ఆత్మజ్ఞానంతో  సర్వ కర్మలు తొలగించుకోవచ్చు.ఎంత సంపాదించిన ఆస్తినైనా ఒక సంతకంతో దానం చేయవచ్చు. కొన్ని లారీల కట్టె లను ఒక చిన్న అగ్గిపుల్లతో దహనం చేయవచ్చు. అలాగే అనేక జన్మలుగా పేరుకుపోయిన కర్మబంధాలను ఆత్మ జ్ఞానమనే జ్ఞానాగ్ని భస్మం చేయగలదు!
భగవద్గీతలో కూడా జ్ఞానాగ్నిః సర్వకర్మా ణి భస్మసాత్ కురుతేఅని చెప్పబడింది. అంటే జ్ఞానాగ్ని అన్ని కర్మలను భస్మం చేస్తుందని శ్రీకృష్ణుడు ఉపదేశించాడు.
సంతకం ఆస్తిఒక వ్యక్తి జీవితాంతం క ష్టపడి వేల ఎకరాల భూమి, ఇళ్లు, ధనం సంపాదించాడు. కానీ చివరికి ఒక సంత కం చేసి ఆ ఆస్తినంతా దానం చేయగల డు. సంపాదించడానికి దశాబ్దాలు పట్టి నా, బదిలీ చేయడానికి ఒక సంతకం చాలు.అగ్గిపుల్ల కట్టెల గుట్టవందల క్విం టాళ్ల కట్టెలు పేర్చినా, వాటిని కాల్చడాని కి ఒక చిన్న అగ్గిపుల్ల చాలు. అగ్గిపుల్ల చిన్నదే అయినా దాని ప్రభావం అపార మైనది.జ్ఞానం కర్మబంధంఅనేక జన్మ లు గా పేరుకుపోయిన అజ్ఞానం వల్లేకర్మబం ధం ఏర్పడుతుంది. ఒకసారి నిజమైన ఆత్మజ్ఞానం కలిగితే, ఆ అజ్ఞానం తొలగి కర్మబంధంనశిస్తుంది.సూర్యోదయంచీకటిరాత్రంతా చీకటి ఉన్నా, సూర్యుడు ఉ దయించగానే క్షణాల్లో చీకటి మాయ మవుతుంది. అలాగే జ్ఞానం వచ్చిన ప్పుడు అజ్ఞానం అంతరించిపోతుంది.
లైటు చీకటి గదిఏళ్ల తరబడి మూసి ఉ న్న చీకటి గదిలో ఒక చిన్న లైటు వెలిగి స్తే చీకటి వెంటనే పారిపోతుంది. చీకటి ని తరిమేందుకు కర్రలు అవసరం లేదు వెలుగు చాలు. తాళం చెవి భారీ ద్వారం
భారీ ఇనుప తలుపును బలంతో కాకుం డా చిన్న తాళంచెవితో తెరవవచ్చు. సరై న జ్ఞానం కూడా అలాంటితాళంచెవిలాం టిదే.క్షమాపణ  శత్రుత్వంఏళ్ల తరబడి కొనసాగిన శత్రుత్వాన్ని ఒక హృద య పూర్వకక్షమాపణతొలగించగలదు.విత్తనం మహావృక్షంచిన్న విత్తనం నుంచి పె ద్ద వృక్షం పుడుతుంది. ఆ మహా వృక్షా న్ని కూడా క్షణాల్లో పడగొట్టొచ్చుఒక నిర్ణ యం జీవిత మార్పుఒక చెడు అలవా టును విడిచిపెట్టాలని తీసుకున్న ఒక నిర్ణయంమొత్తంజీవితాన్నిమార్చేస్తుంది.
ఒక ఆలోచన జీవితాన్నే మార్చేస్తుంది
గురువు ఉపదేశం-మోక్షమార్గంగురు వు చెప్పిన ఒక మహావాక్యం, ఒక ఉపదేశం శిష్యుని జీవితాన్నే మార్చి మోక్షమార్గం లో నడిపించగలదు.ఈ ప్రపంచంలో గొప్ప మార్పులు ఎప్పుడూ పెద్ద పనుల వల్లనే రావు. సరైన సమయంలో చేసిన చిన్న చర్య కూడా అద్భుతమైన ఫలితా న్ని ఇస్తుంది. ఒక సంతకం ఆస్తిని మార్చ గలదు. ఒక అగ్గిపుల్ల కట్టెల గుట్టను భ స్మం చేయగలదు. అలాగే ఆత్మజ్ఞాన మ నే జ్ఞానాగ్ని అనేక జన్మలకర్మబంధాలను భస్మం చేసి జీవునికి ముక్తిని ప్రసాదిస్తుం ది.జ్ఞానం లేనివాడు కర్మలకు బానిస జ్ఞా నం పొందినవాడు కర్మలకు అతీతుడు.
ఇదే ఈ ఉపమానాల పరమార్థం.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్
జి.జె.సి దోమకొండ
కామారెడ్డి
Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments