నేడే ఎడ్లపొలాల అమావాస్య

నేడే ఎడ్లపొలాల అమావాస్య

నేడు ఎడ్ల పొలాలఅమా వా స్య,దాని ప్రాధాన్యత 
ప్రకృతి లో మానవికాసానికి ముక్యం గా వ్యవసాయానికి వెన్నుద న్నుగా నిలబడి రైతుకు అండ గా ఉండే ఎడ్ల కు కృతజ్ఞతగా పూజించే పండుగ ఎడ్లపొలాల అమావాస్య.వాటి రుణంతీర్చు కోవడానికి శ్రావణమాసంచివర లో భాద్రపద అమావాస్య రో జు మూడు రోజుల పాటు జరుపుకునే పండుగ ముక్యం గా తెలంగాణ లో ఎడ్లను కడి గి,కొమ్ము లకు నూనె రాసి వా టిని అందంగా ముస్తాబు చేస్తా రు.శనిగెలు కానీ,పోలేలు చేసి ఆ రోజు వాటికి తినిపిస్తారు. అందుకే ఈ పండుగను పొలా ల అమావాస్య అంటారు లేదా ఎడ్ల పోలాల అమావాస్య అని పిలుస్తారు. ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లాలో రైతుల దీన్ని వైభవంగా జరుపుకుంటారు. ఇందులో భాగంగానే ఎడ్లకు బరువులు దింపే కార్యక్రమం నిర్వహించారు. పొలాల అమావాస్య రోజు ముందు జరుపుకునే ఎడ్ల మెడల మీద నుండి బరువులు దించినట్లు రైతులు ప్రేమ భక్తితో చేసే తంతు ఇది. రెండవ రోజు ఊరు దగ్గరలో ఉన్న వాగులు, గుంటలు చెరువులో తమపశు వులను శుభ్రంగా కడిగి ఇంటికి తీసుకువచ్చి సాయంత్రం వా టిని అందంగా అలంకరిస్తారు  గుంగురు లు, గంటలు గజ్జలు పగ్గాలు ముగుదళ్ళతో పెద్ద నలంకరించి డప్పు చప్పులతో భాగాల సప్పులతో గ్రామ విధుల గుండా గ్రామంలోని పోచమ్మ ఆంజనేయ స్వామి ఆలయాల చుట్టూ ప్రదక్షిణ చేయిస్తారు. అనంతరం ఇంటి వద్ద వాటికి ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకంగా తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించి రైతులు తమ ఉపవాసాన్ని సమర్పిస్తారు.  తెలంగాణలో ముఖ్యంగా అదిలాబాద్ జి ల్లాలో ప్రతి ఊరు ప్రతి గూ డెం తాండల్లో పశువులు కనిపిస్తా యి. ఎడ్ల తో బంధం ఇంకా తెగలేదు. రైతుకుండే ఆపేక్ష కృతజ్ఞత. ఈ పొలాల అమా వాస్య పండుగ సందర్భంగా ఈ దృశ్యాలు కనిపిస్తాయి. శ్రావణమాసంలో వచ్చే బహు ళ అమావాస్య రోజు కొందరు మట్టితో ఏ డ్లను తయారుచేసి గోడకు జాజు తో పొలాలు గీసి పూజ నిర్వహిస్తారుస్త్రీలుసౌభా గ్యం కొరకు తమ పిల్లల రక్షణ కు సంతానం కొరకువ్రతంచేస్తా రు. ఈ వ్రతం ఎంతో విశిష్టత ఉంది ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతం ఆచరిస్తారు వివా హమై చాలాకాలం అయినా కూడా సంతానం కలగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచ రిస్తారు అని కూడా తెలు స్తుంది.ఆరోజు చేసే పొలాల అమావాస్య వ్రత కథ దీన్ని తెలియజేస్తుంది పూర్వం పిల్లలమర్రి అనే గ్రామంలో సంతాన రామావదానులు అనే స్మార్త పండితులు ఉండేవాడు ఆయనకు ఏడుగురు మగ పిల్లలు అందరికీ పెళ్లి లైక్ కోడలు కాపురానికి వచ్చారు పెద్ద కోడలు ఆరుగురికి పిల్లలు పుట్టారు కానీ చిన్న కోడలు సుగుణకు మాత్రం పిల్లలు పుట్టడం జరిగేది అలా ఆరు సార్లు జరిగింది ఆ కారణంగా 0ఓఏ కోడలికి ఆరు సంవత్సరాలు పొలాల అమావాస్య చేసుకోవడం కుదరలేదు అందుచేత సుగుణ అంటే వారికి చాలా కోపం సూటిపోటి మాటలతో భావించేవారు ఏడవ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది ఈసారి సుగుణాన్ని పిలవకుం డా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ల నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నా డు సుగుణ  మృత శిశువుకు జన్మనిచ్చింది ఈ సంగతి తోటి కోడళ్ళకు తెలిస్తే తన వ్రతానికి పిలవరని తలచి చనిపోయిన బిడ్డను తన గదిలో దాచి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డల ముఠా ఉంచి తన తోటి కోడలతో కలిసి పొలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది ఆ తర్వాత తన ఇంటికి వచ్చిన మరణించిన తన పుత్రుని ఎత్తుకొని కన్నీటితో స్మశానానికి వచ్చి గతంలో తన పుత్రుల సమాధుల వద్ద కూర్చుని కన్నీరు పున్నీరుగా విలపించ సాగింది అప్పటికి బాగా చీకటి పడింది ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పొలాలమ్మ దేవి సుగుణ దగ్గర కు వచ్చి ఎందుకు రోధిస్తున్నా వు అని అడిగింది.సుగుణ త న కన్నీటి కథలు వివరించి చెప్పింది పోలాలమ్మ దేవి జాలిపడి సుగుణ బాధప డకు నీ పుత్రుల సమాధుల దగ్గరకు వెళ్లి ఏ పేర్లు అయితే పిల్లలకు పెట్టాలనుకున్నావోవారినిపిలు వు అని అక్కడి నుంచి మాయ మైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్లి తన పుత్రులనుపేరుపేరునాపిలిచిం ది వెంటనే ఆ సమాధుల నుం చి ఆమె పిల్లలు సజీవంగా లే చి తమ తల్లిని కౌగిలించుకు న్నారు. సుగుణ ఆనందంగా వారి దగ్గరకు తీసుకొని వారిని వెంటబెట్టుకొని ఇంటికి వచ్చి జరిగిందంతా తోటి కోడళ్ల కు చెప్పింది. అందరూ సంతోషిం చారు. ఆనాటి నుండి ప్రతి శ్రావణ అమావాస్య నాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ పిల్లాపాపల తో ఆనందమయ జీవితాన్ని అనుభవించి తరించింది ఆంధ్ర ప్రాంతంలోఈరోజుపోలేరమ్మను ప్రత్యేకంగాఎడ్లను,  వారు కూడా పొలాల అమావాస్యగా దాన్ని పూజిస్తారు కనుక పొలా ల అమావాస్య  గా ప్రసిద్ధి చెం దింది.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్
కామారెడ్డి
Uploaded Image Uploaded Image Uploaded Image

0/Post a Comment/Comments