నేడు విప్లవ జ్యోతి అగ్ని కణం, భగత్ సింగ్ జయంతి
భారత స్వాతంత్ర్య సమరం లో విప్లవ తేజం,అమరవీరు డు భగత్ సింగ్ స్వాతంత్ర్య పోరాట చరిత్రలో తన అపార మైనధైర్యసాహసాలతో,అనన్య సామాన్యమైన త్యాగంతో రగిలిన విప్లవ తేజం భగత్ సింగ్. మాతృభూమి స్వేచ్ఛ కోసం అతి పిన్న వయసులోనే ప్రాణాలర్పించి, కోట్లాది మంది భారతీయుల్లో దేశభక్తి రగిలిం చినఅమరవీరుడుఆయన.భగత్ సింగ్ 1907 సెప్టెంబర్ 28న పంజాబ్‌లోని లైల్‌పూర్ జిల్లా ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది. బంగ్రా గ్రామంలో జన్మించారు. ఆయన కుటుంబంలో తండ్రి కిషన్ సింగ్, బాబాయి అజిత్ సింగ్‌లు కూడా స్వాతంత్ర్య సమరయోధులే. చిన్నతనం నుంచే ఇంట్లో స్వదేశీభావాలు, దేశభక్తి వాతావరణాన్ని పీల్చి పెరిగిన భగత్ సింగ్, నాటి బ్రి టిష్ పాలన పట్ల తీవ్ర నిరసన పెంచుకున్నారు. 1919 నాటి జలియన్‌వాలాబాగ్ దురంతం ఆయన హృదయాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఆ ప్రదేశాన్ని సం దర్శించి, నెత్తురోడిన మట్టిని సీసాలో సేకరించి తనతోతెచ్చు కుని నిత్యంస్ఫూర్తిపొందేప్రాంగ ణం అది.గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం చౌరీచౌరాఘటనతోనిలిచిపోవ డంతో, భగత్ సింగ్ విప్లవ మా ర్గాన్నిఎంచుకున్నారు.యువత లో దేశభక్తిని, విప్లవ భావాల ను నింపడానికి నౌజవాన్ భార త్ సభ'ను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత చంద్రశేఖర్ ఆజా ద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి యోధులతో కలిసి 'హిందూస్థా న్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసి యేషన్' లో క్రియాశీలకంగా మారారు.సైమన్ కమిషన్ నిరసనల్లో తీవ్రంగా గాయపడి మరణించిన లాలా లజపత్ రాయ్ మరణానికి ప్రతీకా రం గా, భగత్ సింగ్మరియుఆయ న సహచరులు బ్రిటిష్ పోలీస్ అధికారి సాండర్స్‌ను వధించా రు. ఆ తర్వాత బ్రిటిష్ప్రభుత్వ అణచివేత ధోరణిని ప్రపంచాని కిచాటడానికి,ప్రజలనుమేల్కొల పడానికి 1929 ఏప్రిల్ 8న ఢిల్లీలోని కేంద్ర శాసనసభ లో భగత్ సింగ్, బతుకేశ్వర్ దత్ బాంబులు విసిరారు. ఎవరినీ చంపడం తమ ఉద్దేశం కాదని, "చెవిటి ప్రభుత్వానికి వినపడే లా చేయడమే" తమ లక్ష్యమ ని చాటారు. "ఇంక్విలాబ్ జిం దాబాద్ ,విప్లవం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ స్వేచ్ఛగా లొంగిపోయారు.జైలులో ఉన్న సమయంలో కూడా రాజకీయ ఖైదీల హక్కుల కోసం భగత్ సింగ్ సుదీర్ఘంగా 63 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. నాడు జైలు నుంచి ఆయన రాసిన వ్యాసాలు, లేఖలు ఆయనలోనిగొప్పతత్వవేత్తను, ఆలోచనాపరుడిని ఆవిష్క రించాయి.బ్రిటిష్ ప్రభుత్వం 1931 మార్చి 23న భగత్ సింగ్‌తో పాటు సుఖ్‌దేవ్, రాజ్‌గురులను లాహోర్ జైలులో ఉరితీసింది.ఉరికంబా న్ని అధిరోహించే సమయంలో కూడా చిరునవ్వుతో, దేశభక్తి గీతాలు ఆల పిస్తూ వారు ప్రాణాలర్పించారు. కేవలం 23 ఏళ్ల వయసులోనే అమరత్వ పొందిన భగత్ సింగ్, భారతీ య యువతకు నిత్య స్ఫూర్తిప్ర దాతగాచరిత్రలోనిలిచిపోయారు.