శరన్నవరాత్రులలో అత్యంత పవిత్రమైన తొమ్మిదవ రోజు. ఈ రోజున దుర్గాదేవిని మహిషాసురమర్దినిగా, దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేసే జగన్మా తగా ఆరాధిస్తారు. అమ్మవారి శక్తి, ధైర్యం, విజయానికి ఈ రోజు ప్రతీకగా నిలుస్తుంది.మహిషాసురమర్దిని అమ్మ వారి స్వరూపంమహిషాసురుడు అనే రాక్షసుడు తన అహంకారంతో దేవ తలను, ఋషులను, సమస్త లోకాలను బాధించసాగాడు. అప్పుడు దేవతలందరి తేజస్సుల నుంచి ఆదిపరాశక్తి దుర్గాదేవి ఆవిర్భవించింది.
సింహవాహినిగా, అనేక ఆయుధాలను ధరించి, మహిషాసురుడితో భీకరమైన యుద్ధం చేసి అతడిని సంహరించింది. అందువల్ల అమ్మవారికి మహిషాసురమర్దిని అనే ప్రసిద్ధ నామం వచ్చింది.ఖడ్గం: అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానశక్తి.శంఖం: దైవశక్తిని, శుభా రంభాన్ని సూచిస్తుంది
సింహ వాహనం: ధైర్యం, పరాక్రమం, నిర్భయత్వానికి ప్రతీక.
అభయహస్తం: భక్తులకు రక్షణ, నిర్భయత్వాన్ని ప్రసాదించే తల్లితనం.
శ్లోకం:
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా।
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః॥
భావం: సమస్త జీవులలో శక్తి రూపంలో కొలువై ఉన్న జగన్మాతకు పదేపదే నమస్కారాలు. మనలోని భయాన్ని తొలగించి, ధైర్యాన్ని, వివేకాన్ని, సత్కార్యాలు చేసే శక్తిని ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థించడం ఈ శ్లోకంలోని అంతరార్థం.ఎంతటి దుష్టశక్తి ఎదురైనా ధర్మం, సత్యం, దైవశక్తి అంతిమంగా విజయం సాధిస్తాయి.
మనలోని కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అంతర్గత శత్రువులను జయించడమే నిజమైన అమ్మవారి ఆరాధన.
అమ్మవారికి సాష్టాంగ ప్రాణమం
ఉమాశేషారావు వైద్య
ఎం.ఏ బి.ఇ. డి ఎల్.ఎల్ బి
Passer in AIBE
కామారెడ్డి