ఓ మంచితనమా !
ఓ మానవత్వమా ! మీరెక్కడ?
ఓ సుఖమా !
ఓ ప్రశాంతతా !
ఓ ఆనందమా !
ఓ సంతోషమా !
ఓ చిరునవ్వులారా !
ఓ సిరి సంపదలారా !
ఓ శాంతి సమాధానమా !
ఎక్కడ ? ఎక్కడ ? మీరెక్కడ ?
ఓ నరులారా !
మీరు ఆడే ప్రతి ఆటలో...
మీరు పాడే ప్రతి పాటలో...
మీరు మాట్లాడే ప్రతి మాటలో మేమక్కడ!
ఓ గౌరవమా!
ఓ స్వేచ్ఛా స్వాతంత్ర్యమా!
ఓ దాతృత్వమా ! ఓ దైవత్వమా!
ఓ మంచితనమా ! ఓ మానవత్వమా!
ఓ సమానత్వమా! ఓ సౌభ్రాతృత్వమా!
ఎక్కడ ? ఎక్కడ ? మీరెక్కడ ?
ఓ నరులారా!
మీరు చూసే ప్రతిచూపులో...
మీరు వేసే ప్రతి అడుగులో...
మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో మేమక్కడ!
ఓ కీర్తి కిరీటమా!
ఓ ధైర్యసాహసమా!
ఓ అఖండ విజయమా!
ఓ గులాబి పూలమాలలారా !
ఓ సన్మానమా ! ఓ సత్కారమా !
ఓ శాలువలారా ! ఓ జ్ఞాపికలారా !
ఓ అవార్డులారా ! ఓ రివార్డులారా !
ఎక్కడ ? ఎక్కడ ? మీరెక్కడ ?
ఓ నరులారా!
మీ నిరంతర శ్రమలో...
మీ తరగని తపనలో...
మీ కసి మీ కృషి మీ పట్టుదలలో...
మీ సహనం మీ ఓర్పు మీ నేర్పులో మేమక్కడ!
మచ్చలేని స్వచ్ఛమైన మీ వ్యక్తిత్వంలో మేమక్కడ !
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
