ఎవరు మీరు ?
ఓ దైవమా !
భూగర్భంలో ఎంత
నీరుండి ఏమిలాభం ?
నిరాశావాది నిట్టూర్పు!
ఓ దైవమా !
మాకు బోర్లతో నీరు తోడుకునే
శక్తిసామర్థ్యాలనిచ్చావు అదిచాలు !
ఆశావాది ఆత్మతృప్తి !
ఓ దైవమా !
మాకెటుచూసినా మురికి నీరే
ఒక్కచుక్కైనా త్రాగలేము
నిరాశావాది నిట్టూర్పు !
ఓ దైవమా !
ఒక్కచుక్కైనా త్రాగలేకున్నా
బట్టల్ని శుభ్రం చేయలేకున్నా
తగలబడే ఇంటిని ఆర్పడానికి
మాకు మురికినీళ్ళిచ్చావు అదిచాలు!
ఆశావాది ఆత్మతృప్తి !
ఓ దైవమా !
నదుల్లో ఎంత శుద్దజలముండి ఏంలాభం ?
కడకు ఉప్పుసముద్రంలో కలవకతప్పదే
నిరాశావాది నిట్టూర్పు !
ఓ దైవమా !
కడకు నది కడలిగర్భంలో కలిసినా
తాను పరుగులుతీసినంతదూరం
ఎందరికో దాహాన్ని తీరుస్తుంది
ఎన్నో వేల లక్షల ఎకరాల్లో పచ్చని
పంటలకు ప్రాణం పోస్తుంది అదిచాలు !
ఆశావాది ఆత్మ తృప్తి !
మరి మీరెవరు ?
గ్లాసులో సగం వరకే
నీరుందని దిగులుపడే
పెరటిలోని గులాబీల మాటున
గుచ్చుకునే ముళ్ళున్నాయని
భయపడే బాధపడే నిరాశావాదులా?
గ్లాసులో సగం వరకు నీరుందిచాలని
పెరటినిండా గులాబీలు గుభాళిస్తున్నాయని
ఆనందించే ఆశతో జీవించే ఆశావాదులా ? తేల్చుకోండి!
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్...9110784502
