అభాగ్యునికి ఆక్సిజన్...
పుట్టినప్పటి నుండి
కష్టాలు కాటికి దారి
చూపిస్తూనే ఉన్నాయి
పేదరికం పేగులను
పెనవేసుకుపోయింది
దహించే ఆకలిని
సహించడమెలాగో
పూరిగుడిశలో
మూలనున్న చల్లని
నీటికుండకు తెలుసు
కష్టాలన్నీ కట్టకట్టుకొని
పిడుగుల్లా అడుగుల్లో
పడి పిండి చేస్తున్నాయి
ఎక్కడో మూలిగే మనసు
ధైర్యాన్ని దానం చేసింది
ప్రపంచమంతా ఎంతో వెలుగున్పా
జీవితంలోని చీకటిశవాన్ని మోసుకుంటూ
పశ్చమదిక్కుకు సూర్యుడు పారిపోయాడు
చింతల చితిమంటల్ని చిరునవ్వుతో
ఆర్పేసి ఒకే ఒక్క ఆశను ఆరనిజ్యోతిగా
అంతరంగాన వెలిగించుకొన్నాడు
ఈ లోకాన ఏది ఉన్నాలేకున్నా దైవమొక్కడు
నాకు తోడన్న ఆలోచనే ఆ అభాగ్యునికి ఆక్సిజన్
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502
పుట్టినప్పటి నుండి
కష్టాలు కాటికి దారి
చూపిస్తూనే ఉన్నాయి
పేదరికం పేగులను
పెనవేసుకుపోయింది
దహించే ఆకలిని
సహించడమెలాగో
పూరిగుడిశలో
మూలనున్న చల్లని
నీటికుండకు తెలుసు
కష్టాలన్నీ కట్టకట్టుకొని
పిడుగుల్లా అడుగుల్లో
పడి పిండి చేస్తున్నాయి
ఎక్కడో మూలిగే మనసు
ధైర్యాన్ని దానం చేసింది
ప్రపంచమంతా ఎంతో వెలుగున్పా
జీవితంలోని చీకటిశవాన్ని మోసుకుంటూ
పశ్చమదిక్కుకు సూర్యుడు పారిపోయాడు
చింతల చితిమంటల్ని చిరునవ్వుతో
ఆర్పేసి ఒకే ఒక్క ఆశను ఆరనిజ్యోతిగా
అంతరంగాన వెలిగించుకొన్నాడు
ఈ లోకాన ఏది ఉన్నాలేకున్నా దైవమొక్కడు
నాకు తోడన్న ఆలోచనే ఆ అభాగ్యునికి ఆక్సిజన్
రచన. పోలయ్య కవి కూకట్లపల్లి
అత్తాపూర్ హైదరాబాద్... 9110784502
