సమాజాన్ని చదివి సమాజం కోసమే రచనలు చేసిన గొప్ప వ్యక్తి మున్షీ ప్రేమచంద్ హిందీ ఉర్దూ సాహిత్యంలో ప్రముఖ రచయితగా పేరు పొందిన ఆయన అసలు పేరు ధనవత్ రాయ్.1880జూలై 31 నఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లాంఘీ అనే ప్రాంతం లో జన్మించారు. చిన్న ప్పటి నుండి ఆయనకు చదు వు పై రచనలపై ఆసక్తి ఉండే ది. ప్రేమ్ చంద్ గారు సాధారణ ప్రజల జీవన విధానంవారికష్టా లు సామాజిక అన్యాయాలు వి యాలనుతనరచనలుప్రారం భించారు ఆయన రచనలు సమాజంలో అద్దంలా ప్రతిబిం బిస్తాయి. ముఖ్యంగా రైతుల బాధలు స్త్రీల సమస్యలు,స్థితి గతులు ఎంతో భావోద్వేగంగా వర్ణించారు.ఆయన ప్రసిద్ధ రచ నలు గోదాన్, గబన్, నిర్మల వంటి నవలలు అలాగే అనేక కథలు ఉన్నాయి. ఆయన కథలు సాదాసీదాగా ఉన్నప్ప టికీ లోతైన సందేశాన్ని ఇస్తా యి.అందుకే ఆయనను ఉప న్యాస సామ్రాట్ అని కూడా అంటారు ప్రేమ్ చంద్ఉపాధ్యా యుడుగా పనిచేసి తర్వాత పూర్తిగా రచనల పైన దృష్టి పెట్టారు. స్వతంత్రఉద్యమాన్ని కూడా ఆయన మద్దతుతెలిపా రు. ఆయన రచనలు ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాయి. 1936లో ప్రేమ్ చంద్ గారు మరణించారు. అయినప్పటి కి ఆయన రచనలు ఇప్పటికి ప్రజల్లో మనుషుల్లో జీవిస్తు న్నాయి. సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన సేవలు ఎప్పటి కీ మరువలేనివి . ఆయన ర చనలు మన కు నైతిక విలువ లను నేర్పుతాయి. మరియు సమాజాన్ని మెరుగుపరచ డానికి ప్రేరణను ఇస్తాయి.
ఉమాశేషారావు వైద్య
లెక్చరర్ ఇన్ సీవీక్స్
జి.జె. సి దోమకొండ
కామారెడ్డి జిల్లా